Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వ్యాధికి నివారణ

    (1905) M. H.235 CDTel 192.10

    309. అతి తిండి తరచు వ్యాధికి కారణమౌతుంది. తన పై మోపబడే అనుచిత భారాన్ని తొలగించటమే ప్రకృతికి గల అత్యవసరం. అధిక శ్రమకు గురి అయిన జీర్ణమండల అవయవాలకు విశ్రాంతి కలిగేందుకు రోగి ఒకటి లేక రెండుపూటలు భోజనం చెయ్యకుండా ఉండటమే మంచి మందు. మెదడుతో పనిచేసేవారికి కొన్నిరోజులపాటు పండ్ల భోజనం తరచు గొప్ప ఉపకారం చేస్తుంది. కొద్దికాలం ఏమీ తినకుండా ఉండి, ఆ మీదట సామాన్యమైన భోజనాన్ని మితంగా తినటం ప్రకృతి సిద్ధమైన స్వస్తత శక్తి ద్వారా కోలుకోటానికి దారి తీయటం కొన్నిసార్లు జరుగుతుంది. ఒకటి రెండు నెలలపాటు మితభోజనం ఆత్మత్యాగమే ఆరోగ్యానికి మార్గమని అనేకమంది బాధితుల్లో నమ్మకం పుట్టిస్తుంది.CDTel 192.11

    (1902) 7T 154 CDTel 193.1

    310. చికిత్స వైద్య సలహాల వలన కన్నా వారానికి ఒకటి లేక రెండు రోజులు ఉపవాసం వలన ఎక్కువ మేలు పొందేవారు కొందరున్నారు. వారానికోరోజు ఉపవాసం చెయ్యటం ద్వారా ఒనగూడే ఉపకారం అంతా ఇంతా కాదు.CDTel 193.2

    (1864) Sp. Gifts IV, 133,134 CDTel 193.3

    311. తరచుగాను ఎక్కువ పరిమాణంలోను తినటం జీర్ణమండల సృష్టిస్తుంది. రక్తం కల్మషమౌతుంది. అప్పుడు వివిధరకాల వ్యాధులు వస్తాయి.... CDTel 193.4

    అలాంటి సందర్భాల్లోని బాధితులు ఇతరులు తమకు చేయలేనిది తమకు తాము చక్కగా చేసుకోగలుగుతారు. తాము ప్రకృతి పై బలవంతంగా మోపిన భారాన్ని తొలగించటానికి వారు మొదలు పెట్టాలి. కారణమేమిటో దాన్ని తొలగించాలి. కొద్దికాలం ఉపవాసముండి విశ్రమించటానికి కడుపుకి అవకాశమివ్వాలి. నీటిని జాగ్రత్తగా, అవగాహనతో వినియోగించటం ద్వారా శరీర వ్యవస్థలో ఏర్పడ్డ జ్వరపరిస్థితిని తగ్గించాలి. శరీర వ్యవస్థలోని మలినాల్ని తీసివెయ్యటంలో ప్రకృతికి ఈ చర్యలు తోడ్పడ్డాయి.CDTel 193.5

    [Sp. Gifts IV, 130,131] (1864) C.H.148 CDTel 193.6

    312. మాంసం, ఎక్కువగా పోపువేసిన కూరలు, కేకులు, ఊరగాయ తినటానికి అలవాటు పడ్డ వ్యక్తులు ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారాన్ని వెంటనే ఇష్టపడరు. వారి రుచి అభిరుచి వక్రమైనందున పండ్లు సాదా(బ్రెడ్, కూరగాయలతో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారం వారికి హితమవ్వదు. తాము తినటానికి అలవాటు పడ్డ ఆహారానికి భిన్నంగా ఉన్న ఆహారాన్ని ఆదిలో వారు ఇష్టపడతారనుకోకూడదు. మొదట వారికి సాదా ఆహారం ఇష్టం కాకపోతే, ఇష్టం కలిగేవరకు వారు ఉపవాసముండాలి. ఆ ఉపవాసం వారికి మందు చేసే మేలు కన్నా ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే దుర్వినియోగమైన కడుపుకి ఎంతో కాలంగా అవసరమైన విశ్రాంతిని అది ఇస్తుంది. సాదా ఆహారంతో నిజమైన ఆకలిని తృప్తిపర్చవచ్చు. అది గురి అయిన దుర్వినియోగం నుంచి కోలుకోటానికి, దాని స్వాభావిక స్థితికి చేరటానికి రుచికి సమయం పడుతుంది. అయితే ఆహార పానాల విషయంలో ఆత్మత్యాగ మార్గాన్ని పట్టుదలతో అనుసరించటం వల్ల ఆరోగ్యదాయకమైన ఆహారం కొద్ది కాలంలోనే ఇష్టమౌతుంది. ఆ ఆహారం ఎంతో తృప్తినిస్తుంది. అది రాజభోజనం కన్నా రుచిగా ఉంటుంది.CDTel 193.7

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents