Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ముఖ్యంగా పంది మాంసం గర్హనీయం

    (1868) 2T 96 CDTel 406.9

    693. దేవుడు మీకు వెలుగునిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు. అది ప్రత్యక్షంగా దేవుని వద్దనుంచి వచ్చి మాంసాహారాన్ని విడిచి పెట్టమంటూ మిమ్మల్ని ఉపదేశిస్తున్నట్లు మీరు నమ్ముతున్నట్లు చెప్పుతున్నారు. పందిమాంసం తినటం ఆయన ఆజ్ఞకు విరుద్ధమని, ఆ ఆజ్ఞని తన అధికారాన్ని ప్రదర్శించటానికి కాక దాన్ని తినేవారికి అది హాని చేస్తుంది కనుక ఇస్తున్నాడని మీకు తెలుసు. దాని వాడకం రక్తాన్ని చెడురక్తం చేయటం వల్ల క్షయ తదితర ప్రమాదకరమైన కొన్ని ద్రవాలు శరీర యంత్రాంగాన్ని బాధకు గురి చేస్తాయి. ముఖ్యంగా మెదడు తాలూకు సున్నితమైన నరాలు బలహీనమై, మనసు మసక బారినందువల్ల పరిశుద్ధ విషయాలు, సామాన్య విషయాల మధ్య విచక్షణ ఉండదు.CDTel 406.10

    (1905) M.H.313,314 CDTel 407.1

    694. పందుల కణాలు పరాశ్రయ జీవులతో నిండి ఉంటాయి. పందుల గురించి ప్రభువు ఇలా అన్నాడు, ” అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు.” దేవుడు ఈ ఆజ్ఞని ఇచ్చాడు. ఎందుకంటే పంది మాంసం తినటానికి : అనర్హమైంది. పందులు మలినాల్ని శుభ్రం చేసే జీవులు. అవి ఇందుకు మాత్రమే ఉపయుక్తమౌతాయి. మానవులు వాటి మాంసాన్ని ఎన్నడూ ఎట్టిపరిస్థితిలోను తినకూడదు.CDTel 407.2

    (1865) H. & L., అధ్యా.1, పుట 58 CDTel 407.3

    695. పందిమాంసం అతి సామాన్యంగా ప్రజలు తింటున్నప్పటికీ ఎంతో హానికరమైనది. హెబ్రీ ప్రజలు తినకూడదని దాన్ని నిషేధించినప్పుడు కేవలం తన అధికారాన్ని చూపించుకోటానికి దేవుడు ఆ పని చెయ్యలేదు. మనుషులు తినతగిన ఆహారం కాదని దాన్ని నిషేధించాడు. అది శరీర వ్యవస్థని క్షయతో నింపుతుంది. ముఖ్యంగా వేడిగా ఉంటే ఆ వాతావరణంలో అది కుష్ఠువ్యాధి, ఇంకా రకరకాల వ్యాధులు కలిగించేది. ఆ వాతావరణంలో వ్యవస్థ పై దాని ప్రభావం చల్లని వాతావరణంలోకన్నా ఎక్కువ హానికరంగా ఉండేది. అయితే పంది మాంసం ఏ పరిస్థితుల్లోనూ తినటానికి దేవుడు నిర్దేశించలేదు. అన్యులు పందిమాంసం సామాన్య ఆహార పదార్ధంగా తింటారు. అమెరికా ప్రజలు పంది మాంసం ప్రధాన ఆహార పదార్థంగా విరివిగా వాడ్డారు. దాని స్వాభావిక స్థితిలో పంది మాంసం రుచిగా ఉండదు. దానికి రుచి కూర్చటానికి ఎక్కువగా పోపు పెడ్తారు. అది హానికరనమైన దాన్ని మరింత హానికరం చేస్తుంది. అన్ని రకాల మాంసం కన్నా పందిమాంసం ఎక్కువ చెడు రక్తాన్ని తయారుచేస్తుంది. పందిమాంసం విరివిగా తినేవారు వ్యాధులకి గురి కావటం తధ్యం. ఆరుబయట వ్యాయామాన్నిచ్చే పని చేసేవారు నీడపట్టున మెదడుతో పనిచేసేవారు తిన్నంతగా పందిమాంసం తిన్నా అంతే దుష్పలితాలకి గురికారు.CDTel 407.4

    పంది మాంసం తినటం శరీరారోగ్యానికి మాత్రమే హానిచెయ్యదు. ఈ అనుచితాహార పదార్థం మనసుకి హానిచేసి, సున్నితమైన సానుభూతి భావాల్ని మొద్దుబార్చుతుంది. అశుద్ధమైనది తన శరీరంలో స్వాభావిక భాగమైన, హేయమైన ప్రతీదాన్ని తినే ఏప్రాణి మాంసం ఆరోగ్యంగా ఉండటం అసాధ్యం. అవి తినే ఆహారాన్ని బట్టే పందుల దేహాలుంటాయి. మనుషులు వాటి మాంసాన్ని తింటే వారి రక్తం, మాంసం పందుల వల్ల వచ్చే మలినాల ద్వారా చెడ్డవవుతాయి.CDTel 408.1

    పంది మాంసం క్షయ, కుష్ఠు, క్యాన్సరు, కంతులు పుట్టిస్తుంది. పంది మాంసం తినటం మానవాళికి ఇంకా తీవ్ర బాధ కలిగిస్తున్నది.CDTel 408.2

    [పందిమాంసం నిషేధం దానియేలు వైఖరి-34)CDTel 408.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents