Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పలుకుబడి వీద ప్రయోజకత్వం మీద ప్రభావం

    M.S.93, 1901 CDTel 47.3

    71. ఎంతో ఆత్మోపేక్ష పాటించాల్సిన సమయంలో పొట్టను అనారోగ్యకరమైన, కుళ్లిపోటానికి సిద్ధంగా ఉన్న ఆహారంతో కూరటం తరచు జరగటం ఎంత విచారకరం! అన్నకోశం పై పడుతున్న భారం అది పడుతున్న బాధ మెదడుకు హాని కలిగిస్తుంది. అవివేకంగా తినే వ్యక్తి మంచి సలహా ఇవ్వటానికి గాని దేవుని సేవ పురోగతికి ప్రణాళికలు రూపొందించటానికి గాని తనను తాను అనర్హుణ్ణి చేసుకుంటున్నానని గుర్తించడు. ఇదీ అంతే. అతడు ఆధ్యాత్మిక విషయాన్ని గ్రహించలేడు. మండలి సమావేశాల్లో తాను ఔను, ఆమెన్ అనాల్సినప్పుడు అతడు కాదు అంటాడు. అతడి ప్రతిపాదనలు అర్థం పర్థం లేకుండా ఉంటాయి. అతడు తిన్న భోజనం అతడి మెదడు శక్తిని మందగిల్లజేస్తుంది.CDTel 47.4

    శరీరాశల తృప్తి సత్యం తరపున సాక్ష్యమివ్వకుండ దైవ సేవకుణ్ని ఆటంకపర్చుతుంది. తన దీవెనల నిమిత్తం దేవునికి మనం తెలుపుకునే కృతజ్ఞతల్ని మనం తినే తిండి వక్రీకరిస్తుంది. విభేదాలు, పోట్లాటలు, అసమ్మతి ఇంకా అనేక కీడులు అనర్థాలకు తిండి హేతువవుతుంది. సహనంలేని మాటలు, దయలేని పనులు, నిజాయితీ లేని కార్యాలు చోటు చేసుకుంటాయి. ఆవేశం పెచ్చరిల్లుతుంది. ఇదంతా అన్నకోశం దుర్వినియోగం వల్ల మెదడులోని నరాలు వ్యాధిగ్రస్తమైనందువల్ల జరిగే అనర్థం.CDTel 47.5

    (1870) 2T368 CDTel 48.1

    72. అన్నపానాల విషయంలో దేవున్ని మహిమ పర్చటం అవసరమన్న విషయం కొందరిని ప్రభావితం చెయ్యలేకపోతున్నది. తిండి వాంఛ తృప్తి వారి జీవిత సంబంధాలన్నింటిని ప్రభావితం చేస్తుంది. వారి కుటుంబంలో వారి సంఘంలో వారి ప్రార్థన సమావేశంలో, వారి పిల్లల ప్రవర్తనలో అది దేవుడు ఉద్దేశించిన సత్యాన్ని మీరు వారికి బోధపర్చలేరు. తాను సృజించిన ప్రజలందరి పోషణ కు ఆనందానికి దేవుడు సమస్తం సమృద్ధిగా సమకూర్చాడు. ఆయన చట్టాల్ని అతిక్రమించటం ఎన్నడూ జరిగి ఉండకపోతే, అందరూ దైవ చిత్రానికి అనుగుణంగా ప్రవర్తించి ఉంటే, దుఃఖం, ఎడతెగని దుర్మారం బదులు ఆరోగ్యం, సమాధానం, సంతోషం లోకంలో ప్రబలేవి.CDTel 48.2

    (1875) 3T486,487 CDTel 48.3

    73. తిండి వాంఛ తృప్తి శారీరక దుర్బలత కలిగించి, పరిశుద్ధ నిత్య జీవిత సంబంధిత విషయాల్ని గ్రహించకుండేటంతగా జ్ఞానేంద్రియాల్ని మొద్దుబార్చుతుందని లోక రక్షకునికి తెలుసు. లోకం తిండిబోతుతనానికి బాసిసయ్యిందని, ఈ వ్యసనం నైతిక శక్తుల్ని వక్రీకరిస్తుందని క్రీస్తుకు తెలుసు. మానవజాతి పై తిండి ప్రీతి పట్టు అంత పటిష్టంగా ఉండటంతో దాని శక్తిని భగ్నం చేయటానికి మానవుడి పక్షంగా దేవుని కుమారుడు దాదాపు ఆరు వారాలు ఉపవాసముండటం అవసరమైతే క్రీస్తు జయించినట్లు జయించటానికి క్రైస్తవుడి ముందున్న కార్యం ఎంత సమున్నతమైంది! అరణ్యంలో క్రీస్తు ఆచరించిన ఆ సుదీర్ఘ ఉపవాసం కలిగించిన తీవ్ర వ్యధ మాత్రమే. వక్ర తిండి తృప్తికి కలిగే శోధన శక్తిని కొలవగలుగుతుంది.CDTel 48.4

    రక్షణ ప్రణాళికను జయప్రదంగా ముందుకు నడపటానికి, నాశనం ఎక్కడ మొదలైందో అక్కడే మానవ విమోచన కార్యాన్ని ప్రారంభించాలని క్రీస్తుకు తెలుసు. తిండి వాంఛ తృప్తి పర్చుకోటం వల్ల ఆదాము పతనమయ్యాడు. దైవ ధర్మశాస్త్రానికి విధేయత తన విధి అని మానవుడికి విశదం చేయటానికి అతడి శారీరక అలవాట్లను సంస్కరించటం ద్వారా క్రీస్తు తన విమోచన కర్తవ్యాన్ని ప్రారంభించాడు. శీలహీనతకు జాతి క్షీణతకు ప్రధాన హేతువు వక్రాహార వాంఛలను తృప్తి పర్చుకోటం.CDTel 48.5