Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అత్యవసర పరిస్థితుల గుర్తింపు

    (1890) C.T.B.H.117,118 CDTel 409.3

    699. పాలు, పండ్లు, సమృద్దిగా ఎక్కడ దొరుకుతాయో అక్కడ మాంసం తినాల్సిన అవసరం ఉండదు. మన సామాన్య అవసరాలకి దైవ సృష్టిలోని ఏ ప్రాణుల్నీ బలి తీసుకోనవసరం లేదు. కొన్ని జబ్బులకు గురి అయినప్పుడు లేదా అలసిపోయినప్పుడు కొంచెం మాంసం తీసుకోవటం అవసరమవ్వవచ్చు. కానీ ఆరోగ్యంగా ఉన్న జంతువులనుంచి తీసుకున్న తాజా మాంసాన్ని ఉపయోగించటానికి శ్రద్ధ తీసుకోవాలి. నాకు అవసరమైన ఆహారం దొరకనప్పుడు నేను కొన్ని సార్లు కొద్దిగా మాంసం తింటాను. కానీ అలా చేయటానికి నాకు చాలా భయం వేస్తుంది.CDTel 409.4

    [కొన్ని సార్లు ఇ.జి.వైట్ కొద్దిగా మాంసం తినటం అవసరమయ్యింది - అనుబంధం 1:10]CDTel 409.5

    Y.I. మే 31, 1894) CDTel 409.6

    700. ఎక్కువ భాగం జావ తీసుకోటమే ఉచితాహారమని కొందరు యదార్ధంగా భావిస్తారు. చాలా మట్టుకు జావ తీసుకోటం జీర్ణమండల అవయవాల ఆరోగ్యానికి దోహదం చెయ్యదు. ఎందుకంటే అది ఎక్కువ భాగం ద్రవ పదార్ధంలా ఉంటుంది. మాంస భోజనం అన్ని భోజనాలకన్నా ఆరోగ్యవంతమైన భోజనం కాదు. అయినా అందరూ మాంసాహారాన్ని విసర్జించాలని నేను చెప్పను. బలహీనమైన జీర్ణ అవయవాలు గలవారు కూరగాయలు, పండ్లు లేక జావ తినలేనప్పుడు మాంసం తరచుగా తినవచ్చు. మంచి ఆరోగ్యం కావాలని ఆశిస్తుంటే, మనం కూరగాయలు, పండ్లు ఒకే భోజనంలో తీసుకోటం మానాలి. కడుపు బలహీనంగా ఉంటే జీర్ణక్రియ కష్టమై బాధకు గురిఅవుతుంది. మెదడు తికమకపడి మానసిక కృషికి అసమర్ధమౌతుంది. పండ్లు ఒకపూట, కూరగాయలు ఆ తర్వాతి పూట తినండి....CDTel 409.7

    తీపి కేకులు, తీపి ఫుడ్డింగులు, కస్టలు జీర్ణమండల అవయవాల్ని గందరగోళపర్చుతాయి. అలాంటి భోజన పదార్ధాల్ని భోజన బల్లమీద పెట్టి ఇతరుల్ని మనం ఎందుకు శోధించాలి? ఉపాధ్యాయులు విద్యార్థుల ఆహారంలో మాంసం ఎంత ఎక్కువగా ఉంటే ఆధ్యాత్మిక విషయాల్ని అవగాహన చేసుకోటానికి వారి మనసులు అంత తక్కువ సమర్ధంగా ఉంటాయి. పాశవిక ప్రవృత్తులు బలీయమౌతాయి. సున్నిత మనోభావాలు, ఉద్వేగాలు మొద్దుబారాయి. మానసిక శక్తుల విచ్చిన్నానికి తీవ్ర అధ్యయనం ప్రధాన హేతువు కాదు. దాని ముఖ్యకారణం అనుచితాహారం, వేళ పాళా లేని తిండి, శరీర వ్యాయామం లేకపోటం. భోజనానికి విశ్రాంతికి నిశ్చిత కాలం పాటించకపోటం మానసిక శక్తుల్ని నష్టపర్చుతుంది.CDTel 410.1

    [క్రమేణా ఆ చర్య చేపట్టాల్సి ఉన్నా 1884 లో మన సంస్థల్లో మాంసాహారం పూర్తి విసర్జనకు సిద్ధంగా లేము-720]CDTel 410.2

    [పాలు, పంచదార విరివిగా ఉపయోగించటం కన్నా జబ్బులేని మాంసం ఉపయోగించటం మేలు-527,533]CDTel 410.3

    [వైద్యులు మాంసం వాడకం వద్దని బోధిస్తూ, మాంసపదార్థాల వాడకాన్ని నిషేధిస్తూ చికిత్సా దేశాలు రాయకుండటం-434,438]CDTel 410.4

    [క్షయ వ్యాధితో మరణిస్తున్న వారికి మాంస భోజనం నుంచి అవివేకంగా మార్పులు చేయటం-435]CDTel 410.5

    [చాలినన్ని మాం సేతర పదార్థాలు లభించనప్పుడు మాంసాహార నిషేధం -796]CDTel 410.6

    [పండ్లు, గింజలు, పప్పులు సమృద్ధిగా లభించే దేశాల్లోని దైవ ప్రజలకి మాంసాహారం సముచితాహారం కాదు-719) CDTel 411.1

    ఆసుపత్రుల్లో రోగులకు వారి గదుల్లో మాంసం వడ్డించటం-437)CDTel 411.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents