Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంగీతం కన్నా పంట పాఠాలు ముఖ్యం

    MS 95, 1901 CDTel 272.1

    393. కొందరు మిక్కిలి సామాన్యమైన విధులు చేపట్టటానికి పిలుపు పొందుతారు. అది వంట చెయ్యటానికే కావచ్చు. కాగా వంట అనే శాస్త్రం చిన్న విషయం కాదు. నిపుణతతో ఆహారం తయారుచెయ్యటం అత్యవసర కళల్లో ఒకటి. దానిస్థానం సంగీత బోధన, దుస్తుల తయారికన్నా ఉన్నతమైంది. ఇలా అనటం వల్ల సంగీత బోధన, దుస్తుల తయారీ ప్రాముఖ్యాన్ని తగ్గించటం లేదు. అవి చాలా ప్రాముఖ్యం. కానీ ఆరోగ్యదాయకం, రుచికరం అయిన ఆహారం తయారుచెయ్యటం అంతకంటే ప్రాముఖ్యం. ఇది కళలన్నిటిలోకి మిక్కిలి విలువైన కళగా పరిగణన పొందాలి. ఎందుకంటే అది జీవితంతో దగ్గర సంబంధం కలిగివున్నది. దీనిపై దృష్టి పెట్టటం అవసరం. ఎందుకంటే మంచి రక్తం తయారుచెయ్యటానికి శరీర వ్యవస్థకి మంచి ఆహారం అవసరం. ప్రజలకి ఏది ఆరోగ్యాన్ని సమకూర్చుతుందో దానికి పునాది మంచి వంట నేర్పే మిషనరీ సేవ.CDTel 272.2

    రుచిలేని చప్పని ఆహారం తయారుచెయ్యటం వల్ల తరచు ఆరోగ్యసంస్కరణ ఆరోగ్య వైకల్యీకరణ అవుతుంది. ఆరోగ్యసంస్కరణ విజయవంతమవ్వటానికి ముందస్తుగా ఆరోగ్యవంతమైన వంటను గూర్చిన జ్ఞానలోపాన్ని సవరించాలి.CDTel 272.3

    మంచి వంటపనివారు బహు అరుదు. ఆహారం చక్కగా తయారుచేసి తమ కుటుంబాలకి శుభ్రంగా వడ్డించేందుకు అనేకమంది తల్లులు వంట చెయ్యటంలో పాఠాలు నేర్చుకోటం అవసరం. ఆర్గన్ లేక పియానో వెయ్యటానికిCDTel 272.4

    పిల్లలు పాఠాలు నేర్చుకోక ముందు వారికి వంట చెయ్యటంలో పాఠాలు నేర్పించాలి. వంట నేర్చుకోటానికి సంగీతం నేర్చుకోటం ఆపనక్కరలేదు. కానీ ఆరోగ్యవంతమైన, కమ్మని ఆహారం తయారు చెయ్యటం నేర్చుకోటం సంగీతం నేర్చుకోటం కన్నా ప్రాముఖ్యం .CDTel 272.5

    (1870) 2T 538,539 CDTel 273.1

    394. మీ కుమార్తెలకి సంగీతం పట్ల ఆసక్తి ఉండి ఉండవచ్చు. ఇది మంచిదే. కాని వంట జ్ఞానం లేకుండా సంగీత జ్ఞానం మాత్రమే ఉండటంలో పెద్ద విలువ ఉండదు. మీ కుమార్తెలకు తమ తమ కుటుంబాలు ఏర్పడ్డప్పుడు, సంగీతం, ఇతర కళల అవగాహనతో వారు తమ మిక్కిలి విలువైన మిత్రుల ముందు భోజనబల్ల పై పెట్టటానికి చక్కగా వండిన భోజనాన్ని సిద్ధంచెయ్యలేరు. తల్లుల్లారా! మీది పవిత్రమైన పని. ఆయన మహిమను దృష్టిలో ఉంచుకుని, మీ బిడ్డల ప్రస్తుత శ్రేయస్సు కోసం భావి శ్రేయస్సు కోసం జాగరూకతతో, ఓర్పుతో, ప్రేమతో దాన్ని చేపట్టటానికి దేవుడు మీకు సహాయం చేయునుగాక.CDTel 273.2

    [క్రమంలేని తిండి, కుటుంబ సభ్యులు ఒంటరిగా ఉన్నప్పుడు “కొనుక్కునే” భోజనాలు-284]CDTel 273.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents