Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    కోపపడటానికి పిరికితనానికి కారణం

    [C.T.B.H.61,62] (1890) FE.150,151 CDTel 249.1

    361. పిల్లల అలవాట్లన్నింటిలో సక్రమత్వం నియమమై ఉండాలి. భోజనానికి భోజనానికి మధ్య పిల్లల్ని చిరుతిళ్లు తిననివ్వటం తల్లులు చేసే పెద్ద తప్పు. ఈ అలవాటు వల్ల కడుపు అస్తవ్యస్తమై భావి బాధలకి పునాది పడుతుంది. వారి మారాంకి కారణం ఇంకా జీర్ణం కాకుండా ఉన్న అనారోగ్యకరమైన ఆహారం కావచ్చు. కాని దీని విషయం ఆలోచించటానికి తన హానికరమైన యాజమాన్యాన్ని సరిదిద్దుకోటానికి సమయం గడపలేనని తల్లి భావిస్తుంది. అసహనంతో నిండి తొందర చేస్తున్న పిల్లల్ని సముదాయించటానికి ఆగదు. తొందరచేస్తున్న ఆ పిల్లల్ని శాంతపర్చటానికి ఓ కేకు ముక్కో ఇంకో తినుబండారమో ఇస్తుంది. కాని ఇది ఈ కీడుని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎక్కువ పని చెయ్యాలన్న ఆతురతతో కొందరు తల్లులు ఉద్రిక్తత తొందరపాటుకి లోనై పిల్లలకన్నా ఎక్కువ ఆవేశపడి, తిట్టి కొట్టి లేక భయ పెట్టి వారిని శాంతపర్చుతారు.CDTel 249.2

    తల్లులు తరచు తమ బిడ్డల అనారోగ్యం గురించి మాట్లాడారు. వైద్యుణ్ని సంప్రదిస్తారు. కాని వారు కొంచెం లోకజ్ఞానం ఉపయోగిస్తే ఆ సమస్య తిండిలో దోషాలవల్ల ఏర్పడిందని గ్రహిస్తారు.CDTel 249.3

    మనం నివసిస్తున్నది తిండిబోతుతనం ప్రబలుతున్న యుగం. సెవెంతుడె ఎడ్వంటిస్తులు సయితం యువతకు నేర్పిస్తున్న అలవాట్లు ప్రకృతి చట్టాలకి విరుద్ధంగా ఉన్నాయి. ఒకసారి నేను పన్నెండేళ్లలోపు వయసుగల పిల్లలతో కలిసి భోజనబల్ల వద్ద కూర్చున్నాను. మాంసం సమృద్ధిగా వడ్డించబడింది. బలహీనురాలైన ఓ అమ్మాయి పచ్చడి కావాలని అడిగింది. కారం మసాలాలతో నిండిన ఓ పచ్చడి సీసా ఆమెకు అందించారు. అందులోనుంచి పచ్చడి తీసుకుని ఆమె తిన్నది. ఆ అమ్మాయి నరాల బలహీనతకి, ముక్కు మీద కోపానికి ఓ సామెతగా ఉంది. కారంతో నిండిన ఈ మసాలాలు అలాంటి ఆరోగ్యస్థితికి దారి తీస్తాయి. వారిలో ఓ పెద్ద కుర్రాడు తనకు మాంసం వడ్డించకపోతే భోజనం చెయ్యలేనట్లు సూచించాడు. అమర్యాదగా కూడా వ్యవహరించాడు. అతడి ఇష్టాయిష్టాల్ని తల్లే పెంచి పోషించింది. అతడి చంచలత్వానికి ఆమె దాదాపు బానిస అయ్యింది. ఆ కుర్రాడికి ఏమీ పని ఇవ్వలేదు. అతడు తన సమయంలో సింహభాగం వ్వర్ణ విషయాలు చదవటంలో గడిపాడు. అతడు నిత్యం తలనొప్పితో బాధ పడ్డాడు. సామాన్యమైన ఆహారమంటే అతడికి ససేమిరా ఇష్టం లేదు.CDTel 249.4

    తల్లిదండ్రులు తమ పిల్లలకి పని నియమించాలి. సోమరితనం కీడుకి మూలం. కండరాలకి ఆరోగ్యవంతమైన అలసట కలిగించే శారీరక శ్రమ సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన ఆకలి పుట్టిస్తుంది. సరియైన పనిని చేసే యువకుడు తనకి ఆకలి పుట్టించటానికి మాంసంగాని ఇతర నాజూకు వంటకాలుగాని లేవని భోజనబల్ల విడిచి గొణుగుకుంటూ వెళ్లిపోడు.CDTel 250.1

    దేవుని కుమారుడైన యేసు తన చేతులతో వడ్రంగి పనిచేసి యువత అందరికి ఆదర్శనీయుడయ్యాడు. జీవితంలోని సామాన్య విధులు నిర్వహించటాన్ని ద్వేషించేవారు యేసు తన తల్లిదండ్రులకు లోబడి తన కుటుంబ పోషణకు తనవంతు పనిని చేశాడని జాపకముంచుకోవాలి. మరియ యోసేపుల భోజన బల్ల మీద విలాస భోజనపదార్థాలేమీ ఉండేవి కావు. ఎందుకంటే వారు పేదవారు, బడుగు వర్గానికి చెందినవారు. CDTel 250.2