Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నిదానంగా తినండి, మెత్తగా నమలండి

    [C.T.B.H.51,52] (1890) C.H.120 CDTel 103.1

    168. ఆరోగ్యవంతమైన జీర్ణక్రియ జరగటానికి ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. అజీర్తి రోగం రాకుండా చేసుకోవాలని కోరుకునే వారు, దేవునికి ఉత్కృష్టమైన సేవ చెయ్యటానికి తమ శక్తులు తమకు సామర్థ్యాన్నివ్వటానికి అనువైన స్థితిలో వాటిని కాపాడుకోటం తమ విహిత కర్తవ్యంగా గుర్తించేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోటం మంచిది. భోజనం చెయ్యటానికి మీకు ఎక్కువ సమయం లేకపోతే గబగబా కబళించక, తక్కువ తినండి. మెత్తగా నమిలి నెమ్మదిగా తినండి. ఆహారం నుంచి మనం పొందే ప్రయోజనం మనం తినే పరిమాణం పై కన్నా అది ఎంత చక్కగా జీర్ణమయ్యింది అన్నదాని మీద ఎక్కువ ఆధారపడి వుంటుంది. రుచి సంతృప్తి మింగిన ఆహారం రాశిమీద కన్నా అది నోటిలో ఉన్న కాలావధి మీద ఎక్కువ ఆధారపడి వుంటుంది. ఆవేశంలో, ఆందోళనలో లేక హడావుడిలో ఉన్నవారు తమకు విశ్రాంతి దొరికేవరకు లేక ఉపశమనం లభించేవరకు భోంచెయ్యకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇప్పటికే ఎంతో శ్రమకు గురిఅయి జీవశక్తి అగత్యమైన జఠర రసాన్ని సరఫరా చెయ్యలేదు.CDTel 103.2

    (1905) M.H. 305 CDTel 103.3

    169. ఆహారాన్ని మెత్తగా నమిలి నిదానంగా తినాలి. లాలాజలం ఆహారంతో సరిగా మిళితమయ్యేందుకు, జీర్ణక్రియ ద్రవాల చర్య మొదలయ్యేందుకు ఇది అవసరం.CDTel 103.4