Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సమస్యని సరిగా ఎదుర్కోటం

    ఉత్తరం 59, 1898 CDTel 428.2

    722. సేనిటేరియమ్ మంచి సేవలందిస్తున్నది. ఇప్పుడు మనం మాంసాహార సమస్యకు వచ్చాం. సేనిటేరియంకి వచ్చే వారికి మాంసం ఇచ్చి క్రమేపి దాన్ని విసర్జించాలని ఉపదేశించవద్దా? ... కొన్ని తీపి పదార్థాలు తీపి పిండి వంటల కన్నా మాంసం మెరుగయ్యింది గనుక, దాన్ని పూర్తిగా విడిచి పెట్టాలన్న స్థాయికి మనం రాకూడదని ఏళ్ల క్రితం నాకు వచ్చిన వెలుగు సూచిస్తున్నది. ఈ తీపి పదార్థాలు కడుపులో గందరగోళం సృష్టిస్తాయి. మాంసం, కూరగాయలు, పండ్లు, మద్యం, టీ, కాఫీ, తీపికేకులు, పయిల వైవిధ్య మిశ్రమం కడుపు ఆరోగ్యాన్ని నాశనం చేసి, మనుషుల్ని నిస్సహాయ స్థితికి చేర్చుతాయి. వారి స్వభావాల పై వ్యాధి పర్యవసానాలు కనిపిస్తాయి.....CDTel 428.3

    ఇశ్రాయేలు దేవుని వాక్యాన్ని నేను సమర్పిస్తున్నాను. అతిక్రమం కారణంగా దేవుని శాపం భూమి మీదకి పశువుల మీదికి సకల శరీరుల మీదికి వస్తున్నది. మానవులు దైవాజ్ఞలకి దూరంగా వెళ్లిపోటం ద్వారా తమ సొంత మార్గాల పర్యవసానాల్ని అనుభవిస్తున్నారు. జంతువులు కూడా శాపం కింద బాధననుభవిస్తున్నాయి. CDTel 429.1

    రోగుల చికిత్సా దేశాల్లో వైద్యులు మాంసాహారాన్ని చేర్చకూడదు. పశువుల్లో వ్యాధి ప్రబలటం వల్ల మాంసాహారం ప్రమాదకరమౌతున్నది. దేవుని శాపం మానవుడి మీద, జంతువుల మీద, సముద్రంలోని చేపల మీద ఉంది. అతిక్రమం దాదాపు విశ్వవ్యాప్తమౌతున్న నేపథ్యంలో శాపం అతిక్రమానికి దీటుగా ఉంటుంది. మాంసం తినటం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. చచ్చిన జంతువుల మాంసం మార్కెట్టులో అమ్ముతారు. పర్యవసానంగా మనుషుల్లో వ్యాధి ప్రబలుతుంది.CDTel 429.2

    తన ప్రజలు ఎక్కడ చచ్చిన జంతువుల మాంసం ముట్టరో అక్కడకు వారిని దేవుడు తీసుకువస్తాడు. అందుచేత ఈ కాలానికి దేవుని సత్యాన్ని ఎరిగిన ఏ వైద్యుడు వీటిని చికిత్సలో భాగంగా ఆదేశించకూడదు. చచ్చిన జంతువుల మాంసం తినటం క్షేమం కాదు. కొద్ది కాలంలో ఆజ్ఞలు కాపాడే దైవ ప్రజల ఆహారంలో ఆవుపాలని కూడా నిషేధించాల్సి వస్తుంది. కొద్దికాలంలో జంతు సృష్టికి సంబంధించినదేదీ ఉపయోగించటం క్షేమం కాదు. దేవుని మాట నమ్మి ఆయన ఆజ్ఞల్ని పూర్ణ హృదయంతో ఆచరించేవారు గొప్ప దీవెనలు పొందుతారు. ఆయనే వారిని కాపాడ్డాడు. దేవుడు మోసపోడు. అపనమ్మకం, అవిధేయత, దైవచిత్తాన్ని దైవ మార్గాన్ని విడి చి పెట్టటం, పాపిని దేవుని ప్రసన్నతను పొందలేని స్థితికి తీసుకువస్తాయి....CDTel 429.3

    మళ్లీ ఆహార సమస్యని ప్రస్తావిస్తాను. మాంసాహారం విషయంలో గతంలో చేసినట్లు ఇప్పుడు చెయ్యలేం. అది ఎప్పుడూ మానవ కుటుంబానికి శాపంగా ఉంటూ వచ్చింది. కాని ఇప్పుడు మానవుడి అతిక్రమం పాప కారణంగా పొలంలోని మందల పై దేవుడు శాపం ప్రకటించటంతో అది మరింత శాపగ్రస్తమయ్యింది. జంతువుల్లో వ్యాధి ఇంతలంతలుగా పెరుగుతుంది. కనుక మాంసాహారం పూర్తిగా విడిచి పెట్టటం మనకు క్షేమం. నానాటికీ తీవ్రమౌతున్న వ్యాధులు విస్తరిల్లుతున్నాయి. జానంగల వైద్యులు మాంసం తినవద్దని రోగులకి హితవు చెప్పటమే వారు చేయగల సహాయం. ఈ దేశంలో మాంసం విస్తారంగా తిన్నందువల్ల పురుషులేంటి స్త్రీలేంటి భ్రష్టులవుతున్నారు. వారి రక్తం చెడిపోతుంది. వారి వ్యవస్థలో వ్యాధి అంకురిస్తుంది. అనేకులు మాంసాహారం వల్ల మరణిస్తారు. దానికి కారణం వారికి తెలియదు. వాస్తవం తెలిస్తే చచ్చిన జంతువుల మాంసం తినటమే దానికి కారణమని అది సాక్ష్యం చెబుతుంది. చచ్చిన జంతువుల మాంసం తినటమన్న భావన హేయం. అయితే ఇందులో ఇదేగాక ఇంకా వుంది. మాంసం తినటంలో మనం వ్యాధితో చనిపోయిన జంతువుల మాంసం తింటాం. ఇది మానవ యంత్రాంగంలో క్షీణత విత్తనాల్ని నాటుతుంది.CDTel 429.4

    సహోదరుడా, మన సేనిటేరియమ్ లో మాంసాహారానికి చికిత్సాదేశం ఇక ఇవ్వకూడదని నీకు రాస్తున్నాను. దీనికి ఎలాంటి సాకూ లేదు. మానవ మనసు పై దాని ప్రభావ ఫలితం మంచిది కాదు. మనం ఆరోగ్య సంస్కర్తలుగా పనిచెయ్యాలి. వసతి గృహంలో ఉన్న విద్యార్థులుకి సయితం మాంసం వడ్డించటం ఇక జరగదని ప్రకటించాలి. అప్పుడు మాంసాహారం విడిచి పెట్టటం పై మనం ఇచ్చే ఉపదేశం చెప్పటమే కాక, చేసి చూపిస్తుంది. ఈ నియమాల్ని అవగాహన చేసుకున్నప్పుడు, క్రైస్తవుడి ప్రాణాన్ని పోషించటానికి ఏ ప్రాణి ప్రాణమూ తియ్యకూడదన్నది గ్రాహ్యమైనప్పుడు అవి ఎంతో విలువ సంతరించుకుంటాయి!CDTel 430.1