Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    రక్షకుని మీద ఆధారపడండి

    మన పాప స్వభావం గగ్గోలుని మన సొంత శక్తితో నిరాకరించటం అసాధ్యం. ఈ సాధనం ద్వారా సాతాను మన పైకి శోధన తెస్తాడు. ఎవరు తన పై ఆధారపడరో వారందరినీ, తన వ్యంగ్య సూచనల ద్వారాను, వారి అనువంశిక బలహీనతల్ని అలుసుగా తీసుకోటం ద్వారాను తన వలలో వేసుకోటానికి సాతాను ప్రతీ వ్యక్తి వద్దకు వస్తాడని క్రీస్తుకు తెలుసు. మానవుడు ప్రయాణించాల్సిన ప్రదేశాన్ని తాను స్వయంగా దాటివెళ్లటం ద్వారా మనం విజయం సాధించే మార్గాన్ని ప్రభువు మనకు సుగమం చేశాడు. సాతానుతో సంఘర్షణలో మనకు అననుకూల పరిస్థితి ఎదురవ్వాలన్నది ఆయన చిత్తంకాదు. ఆ సర్పం దాడులకి మనం బెంబేలెత్తి నిరుత్సాహ పడకూడదని ఆయన అభిలషిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.”CDTel 151.2

    ఆహార వాంఛతో సతమతమౌతున్న వ్యక్తి శోధనారణ్యం లోని రక్షకుని మీద ఆధారపడి ఉండాలి. సిలువ పై బాధపడ్తూ, “నేను దప్పిగొనుచున్నాను” అంటున్న ప్రభువుని వీక్షించండి. మనం భరించటానికి సాధ్యమైనదంతా ఆయన భరించాడు. ఆయన విజయం మన విజయం.CDTel 152.1

    తన పరలోకపు తండ్రి వివేకం మీద శక్తిమీద ఆనుకుని యేసు నివసించాడు. ఆయన అన్నాడు, “ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. గనుక నేను సిగ్గుపడలేదు.... ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును.” తన ఆదర్శానికి మన దృష్టిని ఆకర్షిస్తూ, ఆయన మనతో ఇలా అంటున్నాడు, “మీలో యెహోవాకు భయపడు... వాడెవడు?... వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.”CDTel 152.2

    యేసు, “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధ మేమియు లేదు” అన్నాడు. సాతాను కుతర్కానికి స్పందించేదేదీ ఆయనలో లేదు. ఆయన పాపం చెయ్యటానికి సమ్మతించలేదు. ఆలోచనలో సయితం ఆయన శోధనకు చోటివ్వలేదు. మనం కూడా ఆయనలా నివసించ వచ్చు. క్రీస్తు మానవత్వం దేవత్వంతో సంయుక్తమయ్యింది. పరిశుద్ధాత్మ తనలో నివసించటం ద్వారా తన ముందున్న సంఘర్షణకు ఆయన సిద్ధపడ్డాడు. తన దైవ స్వభావంలో మనల్ని పాలివారిని చేసేందుకు ఆయన వచ్చాడు. విశ్వాసమూలంగా మనమాయనతో ఏకమై ఉన్నంతకాలం పాపం మనపై అధికారం చెలాయించ లేదు. మనం ప్రవర్తన సంపూర్ణత్వాన్ని సాధించేందుకు క్రీస్తు దేవత్వాన్ని ధృఢంగా పట్టుకోటానికి గాను మన విశ్వాస హస్తం కోసం దేవుడు చెయ్యిచాపుతున్నాడు.CDTel 152.3

    (1875) 3T 561 CDTel 152.4

    239. ఆహార వాంఛను తృప్తిపర్చుకోటానికి శక్తిమంతమైన శోధనలతో క్రీస్తు వద్దకు వచ్చిన రీతిగా సాతాను మానవుడి వద్దకు వస్తాడు. ఈ విషయంలో మానవుణ్ని జయించగల శక్తి తనకున్నదని అతడికి బాగా తెలుసు. తిండి విషయంలో ఆదామవ్వల్ని జయించాడు. వారు తమ ఆనంద ఏదెను గృహాన్ని పోగొట్టుకున్నారు. ఆదాము పతనం ఫలితంగా మన లోకం ఎంత దుఃఖంతోను నేరంతోను నిండింది! విశ్వాన్ని కళంకితం చేసే నికృష్టమైన, జుగుప్సాకరమైన నేరాలు ఘోరాల కారణంగా నగరాలికి నగరాలే భూమి పై లేకుండా తుడిచివెయ్యబడ్డాయి. వాటి పాపాలన్నింటికీ పునాది ఆహార వాంఛే.CDTel 152.5

    240. నాశనం ఎక్కడ సంభవించిందో అక్కడ విమోచన కృషిని క్రీస్తు ప్రారంభించాడు. ఆదాము ఏవిషయంలో పరాజయం పొందాడో దానిలోనే ఆయన మొదటి పరీక్ష జరిగింది. ఆహారానికి సంబంధించిన శోధనల ద్వారా సాతాను మానవుల్లో ఎక్కువమందిని జయించగలిగాడు. తన విజయాన్ని బట్టి పతనమైన ఈ గ్రహం తన ఆధీనంలో ఉందని అతడు భావించాడు. అయితే తనను ప్రతిఘటించగల సమర్థుడొకణ్ని క్రీస్తులో కనుగొన్నాడు. అతడు ఓడిపోయిన శత్రువుగా రణరంగాన్ని విడిచి పెట్టాడు. “నాతో వారికి సంబంధమేమియు లేదు”అంటున్నాడు యేసు. శత్రువుతో మన పోరాటంలో మనం విజయులమౌతామని ఆయన విజయం మనకు భరోసా ఇస్తున్నది. అయితే క్రీస్తుతో సహకరించటానికి మనవంతు ప్రయత్నం లేకుండా మనల్ని రక్షించటం మన పరలోకపు తండ్రి ఉద్దేశం కాదు. మనం మన పాత్రను నెరవేర్చాలి. అప్పుడు దైవశక్తి మనతో చెయ్యికలిపి విజయం చేకూర్చుతుంది.CDTel 153.1

    [క్రీస్తు మన నిమిత్తం ఆకలి కన్నా, మరణం కన్నా బలమైన ఆత్మనిగ్రహాన్ని పాటించాడు-295]CDTel 153.2

    [క్రీస్తు తన ఉపవాసం ద్వారా సహించటానికి శక్తిని పొందాడు; ఆయన విజయం అందరికీ ప్రోత్సాహాన్నిస్తుంది-296]CDTel 153.3

    [తీవ్ర శోధనకు గురి అయినప్పుడు క్రీస్తు ఉపవాసమున్నాడు-70]CDTel 153.4

    [ఆహార వాంఛ తృప్తికి కలిగిన శోధన తాలూకు శక్తికి ఉపవాసంలో ఉన్న క్రీస్తు ఆవేదనే కొలమానం-298]CDTel 153.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents