Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అంతాపోయింది అన్న భావనకు కారణం పరిష్కారం

    రోజుకు మూడు భోజనాలనుంచి రెండు భోజనాలకి మారతున్న వారు ఆదిలో ముఖ్యంగా మూడో భోజనం తినే సమయానికి బలహీనతకు గురి అయినట్లు భావిస్తారు. అయితే వారు కొద్ది కాలం ఓర్పుకలిగి కొనసాగితే ఈ బలహీనత మాయమౌతుంది. మనం నిద్రించటానికి పడుకున్నపుడు, కడుపు శరీరంలోని ఇతర భాగాలు విశ్రమించేందుకు కడుపు దాని పని అంతటిని పూర్తి చేసుకుని ఉండాలి. జీర్ణ ప్రక్రియ నిద్రించే గడియల్లో ఎంతమాత్రం కొనసాగకూడదు. అధిక శ్రమకు గురి అయిన కడుపు దాని విధిని నెరవేర్చిన తర్వాత అలసిపోతుంది. అది బలహీనతను కలిగిస్తుంది. ఇక్కడ అనేకులు మోసపోయి అది కడుపులో ఆహార లేమి పుట్టించే భావనఅని అపార్థం చేసుకుని, కడుపుకి విశ్రాంతి ఇవ్వకుండా మరింత ఆహారం తీసుకుంటారు. అది తాత్కాలికంగా ఆ అశక్తతను తొలగిస్తుంది. ఆహార వాంఛను ఎంత ఎక్కువగా తృప్తి పర్చితే అది అంత ఎక్కువ తృప్తి కోసం గగ్గోలు పెడుంది. సాధారణంగా ఈ అశక్తత మాంసాహార ఫలితంగాను తరచుగాను ఎక్కువ పరిమాణంలోను ఏర్పడుతుంది. అంత ఆరోగ్యదాయకం కాని ఆహారాన్ని పరిష్కరించటంలో ఎడతెగకుండా పనిచేస్తున్నందువల్ల కడుపు అలసిపోతుంది. విశ్రాంతికి సమయం లేనందువల్ల జీర్ణక్రియ అవయవాలు బలహీనమౌతాయి. అందుచేత “పోయింది” అన్న భావన, తరచుగా తినాలన్న కోరిక పుడతాయి. వీటికి పరిష్కారం తక్కువ సార్లు తక్కువ పరిమాణంలో తిని, సామాన్యాహారం రోజుకి రెండు లేక మూడు భోజనాలు తిని తృప్తి పొందటం. కడుపు పని చెయ్యటానికి విశ్రమించటానికి నిర్దిష్ట కాలావధులుండాలి. కనుక క్రమం లేని తిండి, మధ్యమధ్య చిరుతిండ్లు ఆరోగ్యచట్ట అతిక్రమంలో మిక్కిలి ప్రమాదకరమైనవి. క్రమబద్ధమైన అలవాట్లు సరిఅయిన ఆహారంతో కడుపు క్రమేపి కోలుకుంటుంది.CDTel 177.1

    R.&H., మే 8, 1883 CDTel 178.1

    271. దినానికి ఎనిమిది సార్లు తినటానికి కడుపును తర్బీతు చేయవచ్చు. అది సరఫరా అవ్వనప్పుడు బలహీనంగా ఉన్న అనుభూతిని పొందవచ్చు. అయితే ఇది తరచుగా తినటానికి అనుకూల వాదన కాదు. (కంపుకొట్టే శ్వాస, బెరడుకట్టిన నాలుకతో మేల్కోటం-245] CDTel 178.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents