Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోహణానికి సిద్ధపాటు

    (1890) C.T.B.H.119 CDTel 393.8

    651. ప్రభువు రాకకు కని పెట్టుతున్న వారిలో మాంసాహారం క్రమేపి విసర్జించబడుతుంది. వారి ఆహారంలో మాంసం ఓ భాగమవ్వదు. మనం దీన్ని నిత్యం దృష్టిలో ఉంచుకుని క్రమంగా విడిచి పెట్టటానికి కృషిచెయ్యాలి. మాంసం తినే అలవాటు విషయంలో మనం దేవుడిచ్చిన వెలుగు ననుసరించి నివసిస్తున్నామని నేను భావించటం లేదు. మన ఆరోగ్య సంస్థలతో సంబంధమున్న వారందరూ, పండ్లు, గింజలు, కూరగాయల్ని ఆహారంగా తీసుకోటానికి తమని తాము తర్బీతు చేసుకోవాలి. ఈ విషయాల్లో మనం నియమ బద్ధంగా వ్యవహరిస్తే, క్రైస్తవ సంస్కర్తలుగా మన సొంత రుచిని అభిరుచిని తర్బీతు చేసి మన ఆహారాన్ని దేవుని ప్రణాళికననుసరించి తీసుకుంటే అప్పుడు మనం ఈ విషయాల్లో ఇతరుల పై ప్రభావం చూపవచ్చు. అది దేవునికి సంతోషం కలిగిస్తుంది.CDTel 393.9

    [C.T.B.H.48] (1890) C.H.116 CDTel 394.1

    652. ఆకలిని తృప్తి పర్చుకోటమే మానవుడి ప్రధాన లక్ష్యం కాదు. తీర్చవలసిన శరీరావసరాలున్నాయి. ఈ హేతువు చేత మానవుణ్ని ఆహారం నియంత్రించటం అవసరమా? పరలోక దూతల సమాజంలో ప్రవేశించటానికి పరిశుద్ధులు, పవిత్రులు, సంస్కారవంతులు అవ్వటానికి కృషిచేస్తున్నవారు దేవుని మూగ ప్రాణుల ప్రాణాలు తీసి వాటి మాంసాన్ని విలాస వంటకంగా తింటారా? ప్రభువు నాకు చూపించిన దాన్ని బట్టి ఈక్రమం మారుతుంది. దేవుని ప్రతిష్ఠిత ప్రజలు అన్ని విషయాల్లో ఆశనిగ్రహం పాటిస్తారు.CDTel 394.2

    (1909) 9T 153,154 CDTel 394.3

    653. మాంస పదార్థాలు, టీ, కాఫీ, కొవ్వుతో నిండిన అనారోగ్య దాయకమైన ఆహార పదార్థాల వినియోగం గురించి ఉపదేశం పొంది వాటిని త్యాగం చెయ్యటం ద్వారా దేవునితో నిబంధన చేసుకునే వారు అనారోగ్యకరమైందిగా తమకు తెలిసిన ఆహారాన్ని తినరు. మన తిండి ఆపేక్ష ప్రక్షాళనమవ్వాలని, మంచివికాని వాటి విషయంలో ఆత్మత్యాగం పాటించాలని దేవుడు కోరుతున్నాడు. తన ప్రజలు తన సన్నిధిలో పరిపూర్ణులుగా నిలబడకముందు ఇది జరగాల్సి ఉన్నపని.CDTel 394.4

    MS 71, 1908 CDTel 394.5

    654. మన మంచి కోసమే శేషించిన సంఘాన్ని మాంసం, టీ, కాఫీ, ఇతర హానికర పదార్థాల్ని విడిచి పెట్టమని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. మనం భుజించటానికి ఆరోగ్యదాయకమైనవి మంచివి ఎన్నో ఉన్నాయి.CDTel 394.6

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents