Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పట్టుదలతో కొనసాగండి ప్రకృతి తన పనిని చేపడుతుంది

    టీ, కాఫీ, పొగాకు, సారా వాడకం సందర్భంగా ఒకే సురక్షిత మార్గం ఏదనగా వాటిని ముట్టకుండటం, రుచి చూడకుండటం. టీ, కాఫీలు వాటి వంటి ఇతర పానీయాలు సారా, పొగాకూ ఒకే కోవకు చెందినవి. కొన్ని సందర్భాల్లో ఈ అలవాటుని మానటం తాగుబోతు తాగుడు మానటం ఎంత కష్టమో అంత కష్టం. ఈ ప్రేరేపకాలని విడిచి పెట్టటానికి ప్రయత్నించే వారు ఏదో నష్టపోతున్నట్లు అవి లేనందువల్ల ఏదో బాధకి లోనవుతున్నట్లు కొంతకాలం భావించవచ్చు. కాని పట్టుదలతో కొనసాగితే వారు ఆ వాంఛని అధిగమించి, మర్చిపోతారు. దుర్వినియోగమైన ప్రకృతి కోలుకోటానికి కొంత సమయం పడుతుంది. అది మళ్లీ తన శక్తిని సమకూర్చుకుని తన పనిని యాథావిధిగా నిర్వర్తిస్తుంది.CDTel 449.1

    (1875) 3T 569 CDTel 449.2

    748. తన కుటిల శోధనల ద్వారా సాతాను మనసుల్ని భ్రష్టం చేసి ఆత్మల్ని నాశనం చేస్తున్నాడు. అనుచిత ఆహారపానాల్ని మన ప్రజలు చూసి వాటిని పాపంగా గుర్తిస్తారా? టీ, కాఫీ, మాంసపదార్థాలు, ఉద్రేకం పుట్టించే ఆహారాన్ని విడిచి పెట్టి, హానికరమైన ఈ పదార్థాలకి ఖర్చు పెట్టే ద్రవ్యాన్ని సత్యం ప్రకటించటానికి వినియోగిస్తారా?... అమితం ప్రగతిని నిలువరించటానికి పొగాకు భక్తుడికి ఎలాంటి శక్తి ఉంటుంది? చెట్టు వేరు మీద గొడ్డలి పడకముందు పొగాకు అంశం పై మన ప్రపంచంలో విప్లవం రావాలి. ఇంకా కొంచెం దగ్గరకు వద్దాం. టీ, కాఫీలు పొగాకు సారా వంటి బలమైన ప్రేరేపకాల కోసం వాంఛను పెంపొందిస్తున్నాయి.CDTel 449.3

    749. మాంసం గురించి, దాన్ని విడిచి పెట్టాలని మనమందరం చెప్పవచ్చు. అందరూ టీ, కాఫీలు వాడకుండా వాటికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యం ఇవ్వాలి. అవి మత్తు పదార్థాలు. అవి మెదడుకి, శరీరంలోని ఇతర అవయవాలకి ఒకే రీతిగా హాని కలిగిస్తాయి....CDTel 449.4

    మన సంఘాలకు చెందిన సభ్యులు స్వార్ధంతో కూడిన ప్రతీరకమైన తిండిని త్యాగం చెయ్యాలి. టీ, కాఫీ, మాంసపదార్ధాలకి వ్యయం చేసే ప్రతీ పైసా వ్యర్ధం. ఎందుకంటే ఇవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల ఉత్తమాభివృద్ధికి అంతరాయం కలిగిస్తాయి.CDTel 449.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents