Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    భాగం II - సోడా, బేకింగ్ పౌడర్

    (1905) M.H.300,301 CDTel 354.11

    565. బ్రెడ్ చెయ్యటంలో సోడా లేదా బేకింగ్ పౌడర్ వాడకం హానికరం; అది అనవసరం. సోడా కడుపులో మంట పుట్టించి వ్యవస్థ అంతటిని విషకలితం చేస్తుంది. సోడా లేకుండా మంచి బ్రెడ్ తయారు చెయ్యలేమనే గృహిణులు చాలామంది ఉన్నారు. కాని అది తప్పు. వారు మంచి బ్రెడ్ చెయ్యటానికి మెరుగైన పద్ధతులు నేర్చుకోటానికి శ్రమపడితే, వారి బ్రెడ్ ఎక్కువ ఆరోగ్యదాయకంగాను, స్వాభావిక రుచిగలదిగాను ఉంటుంది. అది ఎక్కువ హితంగా ఉంటుంది కూడా,CDTel 354.12

    (R.&.H. మే 8, 1883) CDTel 354.13

    566. సోడా గాని బేకింగ్ పౌడరు గాని వాడటం వల్ల పొంగిన బిస్కెట్లు మన భోజనబల్లల పై కనిపించకూడదు. అలాంటి మిశ్రమాలు కడుపులో ప్రవేశించదగినవి కావు. వేడిగా ఉండి పొంగిన బ్రెడ్ ఏదైనా జీర్ణమవ్వటం కష్టం .CDTel 354.14

    సంపూర్ణ గోధుమపిండిని జల్లించకుండా స్వచ్ఛమైన, చల్లని నీళ్లు, పాలు కలిపి చేసిన జెము ఆరోగ్యవంతమే గాక రుచికరం కూడా. కాగా మన ప్రజలకి సామాన్యత నేర్పటం కష్టం. మేము పరిపూర్ణ గోధుమ జెమ్ ని సిఫారసు చేసినప్పుడు, “అవి చెయ్యటం మాకు వచ్చు” అని మన మిత్రులు అంటారు. అవి బేకింగ్ పౌడరుతోను లేక పుల్ల పాలు సోడాతోను పొంగి కనిపించినప్పుడు మనం ఆశాభంగం చెందుతాం. వీరిలో సంస్కరణ పని చేస్తున్న సూచనలు లేవు. జల్లించని పిండితో సున్నంలేని నీరు, పాలు కలిపి చేసిన జెమ్ లు ఎంతో శ్రేష్ఠమైనవి. నీరు సున్నం కలిసినదైతే, ఎక్కువ పాలు వాడండి. లేదా పిండి ముద్దలో ఓ గుడ్డు కొట్టి కలపండి. జెమ్ ని వేడిగా ఉన్న అవలో నిలకడ గల మంటమీద బాగా బేక్ చెయ్యాలి.CDTel 355.1

    హెల్త్ రిఫార్మ ర్, ఆగ., 1873 CDTel 355.2

    567. అనుచిత వంటవల్ల కుటుంబాలకి కుటుంబాలు బాధపడటం నా ప్రయాణాల్లో చూస్తుంటాను. రుచిగల, చక్కని, ఆరోగ్యకరమైన బ్రెడ్ వారి భోజన బల్లమీద కనిపించదు. సోడా కలిపిన బిస్కెట్లు, బరువైన బ్రెడ్ వేలాది ప్రజల జీర్ణమండల అవయవాల్ని పాడుచేస్తున్నాయి.CDTel 355.3

    [C.T.B.H.49] (1890) C.H.117 CDTel 355.4

    568. ఆహారాన్ని సరిగా తయారుచెయ్యటం మత సంబంధమైన విధి అని కొందరు భావించరు. కనుక (బ్రెడ్ ఎలా చెయ్యాలో నేర్చుకోరు. బ్రెడ్ చెయ్యకముందు పులవనిస్తారు. బ్రెడ్ చేసే వ్యక్తి అజాగ్రత్తను సరిదిద్దటానికి కలిపే సోడా ఆ బ్రెడ్ ని మనుషులు తినటానికి తగనిదానిగా తయారుచేస్తుంది.CDTel 355.5

    (1870) 2T 537 CDTel 355.6

    569. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పసుపురంగు దేహాలు గల వ్యక్తులు, అజీర్తి వ్యాధితో మూలుగుతున్న వ్యక్తులు కనిపిస్తారు. మేము భోజనబల్లవద్ద కూర్చుని, సంవత్సరాలుగా ఒకేలా వండుతూ వస్తున్న ఆహారాన్ని కొన్ని మాసాలుగా తింటున్నప్పుడు, ఈ వ్యక్తులు ఇంకా బ్రతికే ఉండటం ఆశ్చర్యంగొలుపుతుంది. బ్రెడ్, బిస్కెట్లు సోడాతో పసుపుగా ఉంటాయి. కాస్త శ్రమ తగ్గించుకోటానికి సోడాని ఉపయోగిస్తారు. మరపు పర్యవసానంగా బ్రెడ్నె బేక్ చెయ్యకముందు పులు పెక్కనిచ్చి, దాన్ని తొలగించటానికి ఎక్కువ పరిమాణంలో సోడాని కలుపుతారు. అది ఆ బ్రెడ్ ని మనుషులు తినటానికి పనికిరానిదానిగా చేస్తుంది. సోడాని ఏ రూపంలోనూ కడుపులోకి పంపకూడదు. దాని ఫలితం భయంకరం. అది కడుపు పొరలని తినేసి, మంట పుట్టించి, తరచు శరీర వ్యవస్థ అంతటినీ విషపూరితం చేస్తుంది. “సోడా ఉపయోగించకుండా మంచి బ్రెడ్ గాని బిస్కెట్లుగాని చేయలేను” అని కొందరంటారు. మీరు నిజంగా విద్యార్థి అయి నేర్చుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎలా వండాలో, ఎలా తినాలో నేర్చుకోవాలన్న కోరిక పట్టుదల పుట్టించేటంత విలువైంది కాదా మీ కుటుంబ ఆరోగ్యం?CDTel 355.7

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents