Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఐక్యపక్షం

    ఉత్తరం 48,1902 CDTel 29.3

    42. ఆరోగ్య సంస్కరణ ప్రగతి పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. తన ప్రజలు ఒకరితో ఒకరు సామారస్యంగా అన్యోన్యంగా నివసించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. మీకు తెలిసి ఉండాల్సినట్లు, గత ముప్పయి ఐదు సంవత్సరాలుగా * మనం నిలవాలని దేవుడు కోరుతున్న స్థానాన్ని విడిచి పెట్టాం. ఆరోగ్య సంస్కరణను వ్యతిరేకించే స్థితికి ఎలా చేరగలరో అన్న విషయమై జాగ్రత్త పడండి. సంస్కణ పురోగమిస్తుంది. ఎందుచేతనంటే లోకంలోని బాధను తగించటానికి, తన ప్రజల్ని పరిశుద్ధీకరించటానికి అది దేవుని సాధనం.CDTel 29.4

    మీరు విభేదం విభజనకు కారణం కాకుండేందుకు మీ వైఖరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాసోదరుడా! ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని అనుసరింటం ద్వారా కలిగే మేలును నీవు, నీ కుటుంబం అనుభవించటంలో విఫలం చెందుతున్న ఈ అంశం పై దేవుడిచ్చిన వెలుగును వ్యతిరేకించటం ద్యారా ఇతరులకి హానిచెయ్యవద్దు. * CDTel 30.1

    1902 లో రాయబడింది.CDTel 30.2

    (స్పెషల్ టెస్టిమెనీస్, సీరీస్ A, నెం.7, పు.40] C.H.561,562 CDTel 30.3

    43. ఆరోగ్య సంస్కరణను గూర్చి ప్రభువు తన ప్రజలకు ఓ వర్తమాన్నిచ్చాడు. ముప్పయి ఏళ్ళుగా వారి మార్గంలో వెలుగు ప్రకాశిస్తున్నది. దీనికి వ్యతిరేకమయిన మార్గములో నడుస్తుంటే ప్రభువు వారిని సంరక్షించలేడు. ఇతరులతో పంచుకోటానికి ప్రభువు తమకిచ్చిన వర్తమానానికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు ఆయనకు దుఃఖం కలుగుతుంది. ఓ స్థలంలో పని చేసే బోధకుల్లో సగం మంది, శరీరంతో కలిసి హస్తం పనిచేసేలా, మూడోదూత వర్తమానంతో కలిసి ఆరోగ్య సంస్కరణ వర్తమానాన్ని బోధింస్తుండగా, వారి తోటి పనివారు తమ జీవన సరళి ద్వారా సంస్కరణ కు వ్యతిరేకంగా బోధిస్తుంటే ఆయన ఆనందించగలడా? దేవుని దృష్టిలో ఇది పాపంగా పరిగణించబడుతుంది....CDTel 30.4

    మానసిక సామర్థ్యం, మన విశ్వాస హేతుబద్ధతను గూర్చిన అవగాహన ఉన్నా, తమ ఉచ్చరణ ఆచరణల ద్వారా నైతిక బాధ్యతల విషయంలో ఉదాసీనత ప్రదర్శించేవారితో సంబంధం కలిగి ఉండటం కన్నా ప్రభువు సేవకుల్ని ఎక్కువ నిరుత్సాహపర్చేది మరొకటి లేదు.CDTel 30.5

    ఆరోగ్య సంస్కరణ పై దేవుడిచ్చిన వెలుగును తేలికగా చూడకూడదు. అలా పరిగణించేవారే హానికి గురి అవుతారు. దేవుడనుగ్రహించిన వెలుగుకి మాటలు క్రియల ద్వారా విరుద్ధంగా నడచుకొనే వ్యక్తి దైవసేవ విజయవంతంగా సాగించలేడు.CDTel 30.6

    (1867) 1 T.618 CDTel 31.1

    44. మితాన్ని పాటిస్తూ నివసించాల్సిన ఆవశ్యకతను గురించి సువార్త బోధ కులు ఉపదేశించటం ప్రాముఖ్యం. తినటం, పనిచెయ్యటం, విశ్రమించటం, దుస్తులు ధరించటం - వీటికి అనారోగ్యంతో ఉన్న సంబంధాన్ని చూపిస్తూ వారు ఉపదేశించాలి. ఈ చివరి దినాలకు సంబంధించిన సత్యాన్ని విశ్వసించే వారందరికీ ఇందులో పాత్ర వుంది. అది వారికి సంబంధించింది. వారు మేల్కొని ఈ సంస్కరణలో ఆసక్తి చూపించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. ఈ అంశాన్ని వారు నిర్లక్ష్యం చేస్తే ఆయన హర్షించడు. CDTel 31.2

    దీవెనపై తడబాటుCDTel 31.3

    (1867) 1T.546 CDTel 31.4

    45. దేవదూత అన్నాడు, “ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించండి.” మీరు ఆరోగ్య సంస్కరణ విషయంలో తడబడుతున్నారు. అది అనవసరంగా సత్యంతో జతచేసిన అనుబంధంగా మీకు కనిపిస్తుంది. అలాక్కాదు, అది సత్యంలో భాగం. అది మీ ముందున్న ఓ కర్తవ్యం. అది మీకు చేరువగా వచ్చిన మీరు నిర్వర్తిస్తున్న కార్యాలన్నింటికన్నా ఎక్కువ శ్రమతో కూడిన కఠినమైన పని. సందేహిస్తూ, వెనకాడుతూ, పొందే అవకాశం ఉన్న దీవెనను అందిపుచ్చుకోనందువల్ల మీకు నష్టం కలుగుతుంది. మీ ప్రగతిని సులభతరం చేయటానికి మీ మార్గంలో దేవుడు పెట్టిన దీవెన విషయంలో మీరు తడబడుతున్నారు. మీకు గొప్ప మేలుగా పరిణమింంచేదాన్ని మీ శారీరక, ఆధ్యాత్మికత ఆరోగ్యానికి దోహదపడేదాన్ని మీరు ప్రతిఘటించేందుకు, సాతాను దీన్ని మీ ముందు అభ్యంతర విషయంగా నిలుపుతాడు.CDTel 31.5

    సాతాను ప్రభావాలకింద పొరపాటు పనులకు సృష్టించబడ్డ సాకులు-710)CDTel 31.6