Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విభాగం XVI—ఆసుపత్రి పరిమితాహారం

    వివేకంగల సంరక్షణ, మంచి ఆహారం

    MS 50, 1905CDTel 290.1

    419. వ్యాధి గ్రస్తుల సంరక్షణకు సంస్థలు స్థాపితమవ్వాలి. వ్యాధులతో బాధపడుతున్న వారు దైవ భీతిగల వైద్యమిషనరీల సంరక్షణ కింద చికిత్స పొందాలి. వైద్యులు మందులు వాడకుండా వారిని సంరక్షించాలి. ఆహార పానాల్లో అనుచితమైన అలవాట్ల వల్ల వ్యాధి తెచ్చుకున్నవారు ఈ సంస్థలకి వస్తారు. వారికి సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన రుచిగల ఆహారం ఇవ్వాలి. చాలని భోజనం ఇచ్చి వారిని ఆకలిగా ఉంచకూడదు. ఆకలి పుట్టించే పదార్థాలుగా తయారు చెయ్యటానికి అనువుగా ఉండేటట్లు ఆరోగ్యదాయకమైన ఆహారపదార్ధాల్ని ఇతర ఆహారపదార్ధాలతో కలిపి తయారు చెయ్యాలి.CDTel 290.2

    MS 44, 1896 CDTel 290.3

    420. ప్రకృతి వనరుల ద్వారా వ్యాధుల్ని బాగుపర్చి, ప్రజలు జబ్బుపడ్డప్పుడు తమకు తాము చికిత్స చేసుకోటం నేర్పగల ఆసుపత్రిని నిర్మించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆరోగ్యదాయకమైన ఆహారం మితంగా తినటానికి, టీ, కాఫీ, పులిసిన ద్రాక్షారసం, అన్ని రకాల ఉత్తేకాల వంటి మత్తు పదార్థాల్ని విసర్జించి, చచ్చిన జంతువుల మాంసం తినటం మానటానికి ప్రజలు నేర్చుకునే ఆసుపత్రిగా దాన్ని తీర్చిదిద్దాలి.CDTel 290.4