Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్య సంస్కరణపై వెలుగుకి కారణం

    (1870) 2T 399,400 CDTel 11.1

    20. పాపకార్యాలు, దుర్నీతి మూలంగా గతించిన తరాలనుంచీ పేరుకుపోతూ వచ్చిన విషాదపు చీకట్లను కొంతమేరకు నివారించేందుకు, మితంలేని తిండి తాగుడు వల్ల చోటుచేసుకుంటున్న కోకొల్లల దుష్టతను, దుర్నీతిని తగ్గించేందుకు, ఈ చివరి దినాల్లో దేవుడు మన పై తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు.CDTel 11.2

    తమ బిడ్డలు సులభంగా విగ్రహారాధనకు ఆకర్షితులై ఈ యుగంలో ప్రబలుతున్న భ్రష్టతవల్ల కళంకితులు కాకుండేటట్లు జ్ఞాని అయిన ప్రభువు స్వభావములోను అలవాట్లలోనూ లోకస్తుల నుంచి తన ప్రజలు వేరుగా వుండే స్థలానికి వారిని తీసుకురావాలని సంకల్పించాడు. విశ్వాసులైన తల్లిదండ్రులు వారి బిడ్డలు క్రీస్తు రాయబారులు, నిత్యజీవానికి అభ్యర్థులుగా నివసించాలన్నది దేవుని సంకల్పం. దేవ స్వభావమందు పాలివారయ్యే వారందరూ దురాశను అనుసరించడం వలన లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటారు. నిగ్రహరహం లేకుండా తిండి తినేవారు క్రైస్తవ పరిపూర్ణతను సాధించలేరు.CDTel 11.3

    (1890) C.T.B.H.75 CDTel 11.4

    21. మనం ఎదుర్కోగల అనేక అపాయాల్ని వెలుగులో నడవటం ద్వారా తప్పించుకొనేందుకు ఈ చివరి దినాల్లో ఆరోగ్య సంస్కరణ వెలుగు మనమీద ప్రకాశించటానికి దేవుడు అనుమతించాడు. అమితంగా తినటానికి, వాంఛలు తృప్తి పర్చుకోటానికి, తమ సమయాన్ని బుద్దిహీనంగా గడపటానికి మనుషుల్ని నడిపించటానికి సాతాను గొప్ప శక్తితో పనిచేస్తున్నాడు. స్వార్థాశల్ని, లైంగిక వాంఛల్ని తృప్తి పర్చుకొనే జీవితాన్ని ఆకర్షణీయంగా సమర్పిస్తాడు. మితం లేకుండా అనుభవించడం మానసిక శక్తుల్ని, శారీరక శక్తుల్ని నిర్వీర్యం చేస్తుంది. ఇలా విఫలుడైన వ్యక్తి సాతాను భూభాగంలోకి వెళ్తాడు. అక్కడ అతడు సాతాను సోధనలకు గురిఅయి తుదకు ఆ నీతి విరోధి అదుపాజ్ఞలకింద ఉంటాడు.CDTel 11.5

    [C.T.B.H.52) (1890) C.H.120,121CDTel 11.6

    22. ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి అన్నిట్లోనూ మితాన్ని పాటించటం అవసరం - శ్రమలో మితం, తినటంలోనూ, తాగటంలోనూ మితం. పవిత్రతను, పరిశుద్ధతను ప్రేమించేవారు దేవుడు తమకు ఏర్పాటుచేసిన మంచివాటిని జ్ఞానయుక్తంగా ఎలా వినియోగించుకోవాలో గ్రహించేందుకు, తమ దైనందిన జీవితంలో మితానుభవం పాటించటం వలన సత్యం ద్వారా పరిశుద్ధులయ్యేందుకు, కీడునుంచి, హాని నుంచి తప్పించుకునేందుకు, మన పరలోకపు తండ్రి ఆరోగ్యసంస్కరణపై ఈ వెలుగును అనుగ్రహించాడు.CDTel 11.7

    (1890) C.T.B.H.120 CDTel 12.1

    23. ఆరోగ్య సంస్కరణ పరమోద్దేశం మనసు, ఆత్మ, శరీరాల సమగ్రాభివృద్ధి సాధించటమని నిత్యం మనసులో ఉంచుకోవాలి. ప్రకృతి చట్టాలన్నీ దేవుని చట్టాలు. అవి మన శ్రేయస్సు కోసం ఆయన రూపొందించినవి. వాటికి విధేయంగా నివసించటం ఈ జీవితంలో మనకు ఆనందం చే కూర్చి రానున్న నిత్య జీవితానికి మన సిద్ధబాటులో తోడ్పడుతుంది. CDTel 12.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents