Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భాగం II - ఆరోగ్య సంస్కరణ నియమాల్ని సమర్పించే విధం

    సంస్కరణ పరమోద్దేశాన్ని దృష్టిలో ఉంచుకోండి

    (1905) M.H.146,147 | CDTel 478.3

    789. ఆహారసంస్కరణ పై ఉపదేశానికి గొప్ప అవసరం ఉంది. లోకానికి శాపంగా పరిణమిస్తున్న మితిలేని ఆహార పానాలు, నేరం, దౌర్భాగ్యం చాలామట్టుకు తిండికి సంబంధించిన దురలవాట్ల వల్ల అనారోగ్యకరమైన ఆహారం వల్ల సంభవిస్తున్నాయి.CDTel 478.4

    ఆరోగ్య నియమాలు బోధించటంలో సంస్కరణ లక్ష్యాల్ని అనగా దాని ఉద్దేశం శరీరం మనసు ఆత్మల సమున్నతాభివృద్ధి సాధన అని మనసులో ఉంచుకోండి. దేవుని చట్టాలైన ప్రకృతి చట్టాలు మన మేలు కోసమే రూపొందాయి అని, వాటికి విధేయత ఈ జీవితంలో సంతోషాన్నిచ్చి రానున్న జీవితానికి సన్నద్ధమవ్వటానికి తోడ్పడతాయని చూపించండి.CDTel 478.5

    ప్రకృతి కార్యాల్లో దేవుని ప్రేమ వివేకాల ప్రదర్శనను అధ్యయనం చేయటానికి ప్రజల్ని నడిపించండి. మానవ వ్యవస్థ, అనగా అధ్భుతమైన అంగక్రమ నిర్మాణం దాన్ని నియంత్రించే చట్టాల అధ్యయనానికి వారిని నడిపించండి. దేవుని ప్రేమకు నిదర్శనాల్ని గ్రహించేవారు, ఆయన వివేకాన్ని ఆయన చట్టాల ఉపకారాల్ని, విధేయత ఫలాన్ని గూర్చి కొంత మట్టుకు అవగాహన చేసుకునేవారు తమ విధ్యుల్ని బాధ్యతల్ని పూర్తిగా భిన్నమైన దృక్కోణం నుంచి చూస్తారు. ఆరోగ్య చట్టాల ఆచరణను ఓ త్యాగంగా గాని లేదా ఆత్మ నిరసనగా గాని చూసే బదులు దాన్ని ఉన్నదున్నట్లే గొప్ప దీవెనగా పరిగణిస్తారు.CDTel 478.6

    ఆరోగ్య జీవన నియమాల్ని గూర్చి ఉపదేశించటం తన కు నియమితమైన సేవలో భాగమని ప్రతీ సువార్త సేవకుడు భావించాలి. ఈ సేవ అవసరం చాలా ఉన్నది. దానికోసం ప్రపంచం తలుపులు తెరిచి ఉన్నాయి.CDTel 479.1

    (1905) M.H.130 CDTel 479.2

    790. దైవ విధుల్ని మనస్సాక్షికి పరిచయపర్చాలి. పురుషులు, స్త్రీలు తమను తాము పరిశుద్ధపర్చుకోటమన్న విధిని పవిత్రత అవసరాన్ని గుర్తించి తుచ్చమైన శరీరాశలు అపవిత్రమైన అలవాట్ల నుంచి విముక్తికి ప్రయత్నించాలి. మానసికమైన, శారీరకమైన తమ శక్తులన్నీ దేవుడిచ్చే వరాలని వాటిని ఆయన సేవ నిమిత్తం అత్యుత్తమ స్థితిలో పరిరక్షించుకోవాలని వారికి స్పష్టం చెయ్యాలి.CDTel 479.3