Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బోధకులు ప్రజలు కలిసి పని చెయ్యాలి

    (1867) 1T 469,470 CDTel 69.1

    101. సువార్త సేవలో ఓ ముఖ్యమైన భాగం ఆరోగ్య సంస్కరణను మూడోదూత వర్తమానంతో అనుసంధానపర్చి ఆ సేవలో ఓ భాగంగా ప్రజలకు సమర్పించటం. బోధకులు తాము ఆచరణలో పెడుతూ, సత్యాన్ని విశ్వసిస్తున్నట్లు చెప్పేవారు దాన్ని ఆచరించాల్సిందిగా విజ్ఞప్తి చెయ్యాలి.CDTel 69.2

    102. ఆరోగ్య సంస్కరణ మూడోదూత వర్తమానంలో ఓ భాగమని, శరీరంతో హస్తం అనుసంధానమై ఉన్నరీతిగా అది ఆ వర్తమానంతో అనుసంధానపడి ఉన్నదని దర్శనంలో చూశాను. మనం ఓ జనంగా ఈ గొప్ప సేవలో అందరికన్నా ముందు కదలాలని దర్శనంలో చూశాను. బోధకులు ప్రజలు సంఘటితంగా పని చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని ప్రజలు మూడోదూత వర్తమానపు అర్థరాత్రికేకకు సిద్ధంగా లేరు. వారు తమ కోసం తాము చేసుకోవాల్సిన పని ఒకటి ఉన్నది. తమ తరఫున చెయ్యటానికి వారు దాన్ని దేవునికి విడిచి పెట్టకూడదు. వారు చెయ్యటానికి ఆయన ఆ పనిని విడిచి పెడున్నాడు. అది వ్యక్తిగతమైన పని. దాన్ని ఒకరికోసం ఇంకొకరు చెయ్యలేరు. CDTel 69.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents