Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ముందుకి సాగుదాం

    (1864) Sp. Gifts IV, 122 CDTel 78.4

    121. ఆహార విషయంలో దిద్దుబాటు ఖర్చును, శ్రమను తగ్గిస్తుంది. సామాన్యమైన, ఆరోగ్యదాయమైన ఆహారంతో తృప్తి పడే కుటుంబం అవసరాల్ని సులభంగా సరఫరా చెయ్యవచ్చు. విలాసవంతమైన ఆహారం శరీరాన్ని, మనసుకు సంబంధించిన ఆరోగ్యవంతమైన ఇంద్రియాల్ని దెబ్బతీస్తుంది.CDTel 78.5

    ఉత్తరం 309,1905 CDTel 78.6

    122. ఏ శాఖలోను దుబారా జరగకుండా మనం జాగ్రత్తపడాలి. సాధారణంగా తయారు చేసుకున్న సామాన్యమై, స్వచ్ఛమైన ఆహారంతో మనం తృప్తి చెందాలి. ఉన్నవారు లేనివారు ఈ ఆహారాన్ని తినాలి. కర్రీ పదార్థాల్ని ఉపయోగించకూడదు. పరలోక రాజ్యంలో నిత్యం జీవించటానికి మనం ఆయత్తపడ్తున్నాం. మనం ఆ మహావైద్యుని వెలుగులోనూ శక్తిలోనూ మన పనిని చెయ్యటానికి ఎదురు చూడాలి.CDTel 78.7

    హెల్త్ రిఫార్మ ర్, ఆగస్ట్, 1866 123. నా ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి నేను అనుసరించాల్సిన ఉత్తమ మార్గం ఏది అంటూ అనేకులు నన్ను అడుగుతుంటారు. నా సమాధానం ఇది. మీ శరీరానికి సంబంధించిన చట్టాల్ని అతిక్రమించటం మానండి; భ్రష్ఠ భోజన వాంఛల్ని తృప్తి పర్చుకోటం మాని, సామాన్యాహారం తినండి. ఆరోగ్యదాయకంగా వస్త్రాలు ధరించండి. వస్త్రాధారణ మర్యాదగానూ, సామాన్యంగానూ జరగాలి. ఆరోగ్యదాయకంగా పని చెయ్యండి. అప్పుడు మీరు జబ్బుపడరు.CDTel 79.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents