Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మితానుభవాన్ని మిక్కిలి ఆకర్షణీయ రూపంలో సమర్పించండి

    ఉత్తరం 135, 1902 CDTel 487.3

    800. మన విశ్వాసాన్ని ఎరుగని వారిని తమ ఆహారంలో మార్పులు చేసుకోవలసిందిగా కోరి తద్వారా వారిని అకాల పరీక్షకు గురిచెయ్యకుండా ఉండాలని ప్రతీ వాక్యపరిచారకుణ్ని, ప్రతీ వైద్యుణ్ని, ప్రతీ సంఘ సభ్యుణ్ని ప్రభువు కోరుతున్నాడు. ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని ఘనపర్చండి. యధార్ధవంతుల్ని దేవుడు నడిపిస్తాడు. వారు విని విశ్వసిస్తారు. ఆరోగ్య సంస్కరణను గూర్చిన చక్కని సత్యాల్ని ఇతరుల మనసుల్లో దురభిమానం పుట్టించే విధంగా తన సేవకులు సమర్పించాలని దేవుడు కోరటం లేదు. అజ్ఞానపు చీకటి మార్గాల్లో నడుస్తున్న వారి ముందు ఎవరూ అడ్డు బండలు పెట్టకూడదు. ఓ మంచి పనిని ప్రశంసించటంలో కూడా అధిక ఉత్సాహం మంచిది కాదు. ఎందుకంటే వినటానికి వచ్చేవారిని అది తరిమివెయ్యవచ్చు. ఆరోగ్య సూత్రాల్ని వాటి అతి సుందర రూపంలో సమర్పించండి.CDTel 487.4

    మనం ఊహపై ఆధారపడి కదల కూడదు. సంఘాలు స్థాపించటానికి కొత్త స్థలాలికి వెళ్లే పనివారు ఆహారాంశాన్ని ప్రధాన విషయం చెయ్యటానికి ప్రయత్నించటం ద్వారా సమస్యలు సృష్టించకూడదు. ఈ విషయంలో గిరిగీసి అది దాటకూడదని చెప్పకూడదు. ఈ రకంగా ఇతరుల మార్గంలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ప్రజల్ని తోలకండి..... నడిపించండి. యేసు క్రీస్తులో ఉన్న రీతిగా వాక్యం బోధించండి.... అంతా ఒకేసారి నేర్చుకోటం సాధ్యంకాదని గుర్తుంచుకుని పనివారు దృఢ చిత్తంతో పట్టుదలతో కృషి చెయ్యాలి. ప్రజలకు ఓర్పుతో బోధించాలని వారు దృఢంగా నిశ్చయించు కోవాలి.CDTel 488.1

    MS 7a, 1890 CDTel 488.2

    801. మనకు వ్యక్తిగత జవాబుదారీతనం ఉందని మీకు గుర్తుందా? ఆహార పదార్థాల్ని మనం ఓ పరీక్షాంశం చెయ్యం గాని జ్ఞానం గలవారిని చైతన్యపర్చటానికి రోమా 13:8-14; 1 కొరింథీ 9:24-27; 1 తిమోతి 3:8-12 లో పౌలు చెబుతున్నట్లు ఆరోగ్యసంస్కరణను వివేకవంతంగా చేపట్టటానికి నైతిక స్పృహను మేల్కొల్పటానికి ప్రయత్నిస్తాం.CDTel 488.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents