Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విశ్రాంతి కాలానికి సిద్ధబాటు

    (1867) 1 T.619 CDTel 24.1

    36. తన ప్రజలు శారీరకమైన, ఆత్మపరమైన కల్మషం నుంచి తమను తాము శుద్ధిపర్చుకొని దైవభీతితో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. తన న్యాయవిధుల్ని ఆచరిస్తూ లోకంలో నివసిస్తున్న సాత్వికుల్ని ప్రభువు తన ఉగ్రత దినాన కాపాడేటప్పుడు, తాము చెయ్యాల్సిందిగా ఆయన ఆదేశిస్తున్న పనిని విడిచి పెట్టి, ఆయన చేస్తాడని కనిపెడుతూ ఉదాసీనంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే వారందరూ ఆ రోజున తక్కువగా ఉన్నట్లు కనపడతారు.”CDTel 24.2

    దైవ ప్రజలు తమవంతుగా ఎలాంటి ప్రయత్నం చేయకుండా, విశ్రాంతి తమ మీదికి వచ్చి తమ తప్పిదాల్ని తొలగించి, తమ పొరపాట్లను సరిచేస్తుందని కని పెఝ; తమ శరీరాత్మల కల్మషాన్ని శుద్ధిచేసి, మూడోదూత అర్థరాత్రికేకకు తమను సిద్ధం చేయటానికి దానిమీద ఆధారపడితే వారు తక్కువగా ఉన్నట్లు కనపడతారు. దేవుడు తమను పిలిచిన పనిని చెయ్యటం ద్వారా సిద్ధపడిన వారి మీదికే అనగా శరీరాత్మల కల్మషం నుంచి శుద్ధిపొంది దైవ భీతితో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే వారిమీదికే విశ్రాంతి లేదా దేవుని శక్తి వస్తుంది.CDTel 24.3