Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మతిమరపుకి కారణం

    ఉత్తరం 17, 1895 CDTel 136.5

    224. అన్ని విషయాల్లో ఆశానిగ్రహం పాటించాలన్న అంశం పై నీకు అందించేందుకు దేవుడు నాకు వెలుగు నిచ్చాడు. తిండి విషయంలో నీవు నిగ్రహం పాటించటం లేదు. నీ దేహ వ్యవస్థకు అవసరమైన ఆహారానికి రెండు రెట్లు నీవు తరచుగా తీసుకుంటున్నావు. ఈ ఆహారం కుళ్లిపోతుంది. నీ శ్వాస దుర్వాసన కొడుతుంది. నీ పడి సెం సమస్య తీవ్రమౌతుంది. నీ అన్నకోశానికి పని ఎక్కువవుతుంది. నీవు కడుపులోకి తీసుకున్న పదార్థాన్ని విసరటానికి పనిచేసే మిల్లును నడపటానికి, మెదడునుంచి జీవ శక్తిని పిలువటం అవసరమౌంతుంది.CDTel 136.6

    భోజన బల్ల వద్ద నీవు తిండిబోతువు. నీ మరుపుకి జ్ఞాపకశక్తి క్షీణతకు ఇది పెద్ద కారణం. నీవు నాతో చెప్పిన విషయాల్ని చెబుతూ నేను అవి చెప్పలేదు వేరే విషయాలు చెప్పాను అంటావు. ఇది నాకు తెలుసు, కాని అది అతి తిండి పర్యవసానమని గ్రహించి దాన్ని పట్టించుకోలేదు. దాన్ని గురించి మాట్లాడి ఏమి లాభం? అది ఆ కీడును నిర్మూలించదు.CDTel 136.7