Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వుళ్లీ మళ్లీ బోధించాల్సిన పాఠం

    ఉత్తరం 27, 1905 CDTel 103.5

    170. ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవాలని మనం ఆకాంక్షిస్తుంటే, ఆహార వాంఛను అదుపుచెయ్యటం, నిదానంగా తినటం, ఒకే భోజనంలో తక్కువ రకాల భోజన పదార్థాల్ని తినటం అవసరం. ఈ ఉపదేశం తరచుగా పునరావృతం కావలసిన అవసరం వుంది. ఒకే భోజనంలో అనేక రకాల వంటకాలు తినటం ఆరోగ్య సంస్కరణ సూత్రాలికి విరుద్ధం.CDTel 103.6

    (1905) MS 1897 CDTel 104.1

    171. మాంసాహారం నుంచి శాఖాహారానికి మారేటప్పుడు, పద్దతిగా తయారుచేసి, చక్కగా వండిన ఆహారం భోజన బల్లమీద ఉంచటంలో శ్రద్ధ వహించాలి. జావ ఎక్కువగా తినటం పొరపాటు. నమలటం అవసరమయ్యే గట్టి ఆహారం మంచిది. ఈ విషయంలో ఆరోగ్య ఆహార పదార్థాల తయారీ ఓ దీవెన. సంపూర్ణ గోధుమ బ్రెడ్, రోలు సామాన్యంగా తయారుచేసుకుని ఉపయోగించుకోటం ఆరోగ్యదాయకం. బ్రెడ్లో ఎలాంటి పుల్లదనం ఉండకూడదు. బ్రెడ్ చక్కగా ఉడికేలా బేక్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల అది మెత్తగా లేకుండా, సాగకుండా ఉంటుంది.CDTel 104.2

    ఆరోగ్యకరంగా తయారు చేసిన మంచి కూరగాయలుఉపయోగించగలిగిన వారికి - జావకన్నా లేక గంజి కన్నా శ్రేష్టం. రెండు మూడు దినాల కిందట చక్కగా బేక్ చేసిన బ్రెడ్’ పండ్లు తినటం తాజా బ్రెడ్తో తినటం కన్నా ఆరోగ్యవంతం. దీన్ని మెత్తగా నమిలి నెమ్మదిగ తినటం ద్వారా శరీరానికి అవసరమైన పోషణ అంతా లభిస్తుంది.CDTel 104.3

    R... H. మే 8, 1883 CDTel 104.4

    172. బ్రెడ్ రోల్స్ చెయ్యటానికి సాఫ్ట్ వాటర్ (సున్నం లేని నీళ్లు) • పాలు లేక కొంచెం మీగడ వాడండి. దీన్ని (పిండి ముద్దను) గట్టిగా చేసి కేకర్ల కోసం నీడ్ చేసేటట్లు నీడ్ చెయ్యండి. అవన్ గ్రేట్ మీద వాటిని బేక్ చెయ్యండి. ఇవి మధురంగా రుచిగా ఉంటాయి. వీటిని మెత్తగా నమలాలి. ఇలా సమలటం పళ్ళకి కడుపుకి రెంటికీ మంచిది. అవి మంచి రక్తాన్ని ఉత్పత్తి చేసే శక్తినిస్తాయి.CDTel 104.5