Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విభాగం XXV—ఆరోగ్య సూత్రాల బోధన

    భాగం I - ఆరోగ్య అంశాలపై ఇవ్వాల్సిన ఉపదేశం

    ఆరోగ్య ఉపదేశం అవసరం

    (1905) M.H. 125,126 CDTel 459.1

    759. ఆరోగ్య సూత్రాలపై ఉపదేశం అవసరం మునుపెన్నటికన్నా నేడు ఎక్కువగా ఉన్నది. అనేక విధాలుగా జీవితానికి సంబంధించిన వసతులు, సౌకర్యాల పరంగాను, పారిశుధ్యం, వ్యాధులకి చికిత్స పరంగాను ఎంతో ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ, శారీరక శక్తి, సహన శక్తి క్షీణత ఆందోళనకరంగా ఉంది. తోటి మనుషుల సంక్షేమం కోరేవారందరూ దీనిపై గమనాన్ని నిలపటం అవసరం.CDTel 459.2

    మన కృత్రిమ నాగరికత మంచి నియమాల్ని నాశనం చేసే చెడుగును ప్రోత్సహిస్తున్నది. ఆచారం ఫ్యాషన్ ప్రకృతితో సంఘర్షణ పడుతున్నాయి. అవి శాసించే అలవాట్లు, అభ్యాసాలు, ప్రోది చేసే వాంఛలు, శారీరక, మానసిక శక్తిని క్రమక్రమంగా క్షీణింపజేసి, మానవ జాతిపై భరించలేని భారాన్ని మోపుతున్నాయి. అమితత్వం, నేరం, వ్యాధి, దౌర్భాగ్యం అన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి.CDTel 459.3

    అనేకులు అజ్ఞానం వల్ల ఆరోగ్య చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారు. వారికి ఉపదేశం అవసరం. కాని అధిక సంఖ్యాకులు తెలిసే తప్పు చేస్తున్నారు. తమ జ్ఞానాన్ని తమ జీవన మార్గదర్శిగా చేసుకోటం ప్రాముఖ్యమని వారు గుర్తించేటట్లు చెయ్యటం అవసరం.CDTel 459.4

    (1905) M.H.146 CDTel 459.5

    760. ఆహార సంస్కరణను గూర్చిన ఉపదేశానికి గొప్ప అవసరం ఉంది. లోకానికి శాపంగా పరిణమిస్తున్న వక్ర తిండి అలవాట్లు, అనారోగ్యకరమైన అమిత తిండికి నేరానికి దౌర్భాగ్యానికి చాలా మట్టుకు కారణాలు.CDTel 459.6

    (మెడికల్ మిషనరీ, నవంబరు-డిసెంబరు 1892) C.H.505 CDTel 460.1

    761. సేవ చెయ్యటానికి మనం పిలుపు పొందిన ఏ సమాజంలోనైనా నైతిక ప్రమాణాన్ని లేపాలని ఆశించినట్లయితే వారి శారీరకమైన అలవాట్లను సరిదిద్దటానికి మొదలు పెట్టాలి. మానసిక, శారీరక శక్తుల సరియైన కార్యాచరణ పై సచ్చీలం ఆధారపడి ఉంటుంది.CDTel 460.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents