Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పుల్లటి బ్రెడ్ వల్ల అనర్ధాలు

    (1868) 1T 681-684 CDTel 328.7

    498. ముతక గోధుమ బ్రెడ్ బరువుగా, పుల్లగా, కొంత ఉడికి కొంత ఉడకకుండా ఉన్నట్లు తరచు కనుగుంటాం. నేర్చుకోటానికి ఆసక్తి లేనందువల్ల, బేక్ చేసేవాడు తన విధి నిర్వహణలో అశ్రద్ధ చూపించటం వల్ల ఇది సంభవిస్తుంది. జెమ్ కేకులు లేక మెత్తని బిస్కెట్టులు బేక్ చెయ్యటం కాక ఎండబెట్టటం జరిగినట్లు కొన్నిసార్లు కనుగొంటాం. ఇతర విషయాలు కూడా ఇలాగే జరిగినట్లు తెలుసుకుంటాం. వంటగాళ్లు పాతరోజుల వంటలు తాము బాగా చేస్తామని మీకు చెబుతారు. కాని నిజం చెప్పాలంటే వారి కుటుంబాలకి ఈ ముతక గోధుమ బ్రెడ్ ఇష్టం ఉండదు. ఈ రకంగా వారు ఆకలితో మరణిస్తారు.CDTel 328.8

    అది నాకు ఆశ్చర్యం కలిగించదు అని నాలో నేను అనుకున్నాను. మీ ఆహారం రుచిగా లేకపోటానికి మీరు దాన్ని తయారుచేసే విధమే కారణం. అలాంటి ఆహారం తినే వ్యక్తి అజీర్తి రోగి అవ్వటం ఖాయం. ఇలాంటి వంటకాలు చేసే వంటగాళ్లు వారి వంటలు తినే అభాగ్యులు ఆరోగ్య సంస్కరణ తమకు సరిపడటం లేదని గంభీరంగా ప్రకటిస్తారు.CDTel 329.1

    నాణ్యతలేని, బరువైన, పుల్లని బ్రెడ్ ని మంచి ఆహారంగా కడుపు మార్చుకోలేదు. ఈ రకం బ్రెడ్ ఆరోగ్యంగా ఉన్న కడుపుని వ్యాధిగ్రస్తం చేస్తుంది. అలాంటి ఆహారం తినేవారు శక్తిని కోల్పోతున్నామని తెలుసుకుంటారు. దానికి హేతువు లేదా? వీరిలో కొందరు ఆరోగ్య సంస్కర్తలుగా చెప్పుకుంటారు గాని కారు. వారికి వంట చెయ్యటం రాదు. వారు కేకులు, బంగాళా దుంపలు, ముతక గోధుమ బ్రెడ్ తయారు చేస్తారు. కాని అదే పద్ధతి అందులో ఏమీ మార్పు ఉండదు. శరీర వ్యవస్థకు బలం చేకూరదు. ఆరోగ్యకరమైన, రుచిగల ఆహారం తయారు చెయ్యటంలో అనుభవాన్ని సంపాదించటానికి వెచ్చించే సమయం వ్యర్ధమయ్యే సమయమని వారు భావిస్తున్నట్లు కనిపిస్తుంది....CDTel 329.2

    అనేక కుటుంబాల్లో అజీర్తి రోగులున్నట్లు మనం తెలుసుకుంటున్నాం. దీనికి కారణం నాణ్యత లోపించిన బ్రెడ్, దాన్ని పారెయ్యకూడదని గృహిణి అంటుంది. దాన్ని ఇంటిల్లిపాది తింటారు. పనికిరాని బ్రెడ్ ని నివారించే మార్గం ఇదేనా? రక్తంగా మార్చటానికి దాన్ని మీరు మీ కడుపులోకి పంపుతారా? పుల్లని బ్రెడ్ ని తియ్యని దానిగా మార్చేశక్తి, బరువైన బ్రెడ్ని తేలిక చేసే శక్తి, బూజుపట్టిన బ్రెడ్ ని తాజా చేసే శక్తి కడుపుకి ఉన్నదా?...CDTel 329.3

    వంట విషయంలో సరిఅయిన జ్ఞానం, వండటంలో నిపుణత లేని అనేకమంది భార్యలు, తల్లులు రోజుకి రోజు సరిగా తయారుచెయ్యని ఆహారాన్ని, తమ జీర్ణమండల అవయవాల్ని నాశనం చేసే, నాణ్యత కొరవడ్డ రక్తాన్ని తయారుచేసే, కడుపులో మంట పుట్టించే, అకాల మరణం కలిగించే వ్యాధులకి దారితీసే, ఆహారాన్ని తమ కుటుంబాలకి సమర్పిస్తున్నారు. అనేకమంది బరువైన పుల్లని బ్రెడ్ తినటం వల్ల మరణిస్తున్నారు. వంటపని చేస్తున్న ఓ బాలిక ఉదంతాన్ని నాకు చెప్పారు. ఆమె కొన్ని పుల్లని, బరువైన బ్రెడ్లు చేసింది. ఆ బ్రెడ్ లని తొలగించుకుని, తన పొరపాటుని కప్పిపుచ్చుకోటానికి, ఆ బాలిక వాటిని రెండు పెద్ద పందులకు వేసింది. మరుసటి ఉదయం ఆ గృహ యజమాని తన పందులు చచ్చిపడి ఉండటం చూశాడు. అతడు ఆ విషయాన్ని దర్యాప్తు చేసినప్పుడు పందుల తొట్టెలో ఈ బ్రెడ్ ముక్కలు కనిపించాయి. ఇంకా దర్యాప్తు చేసిన మీదట ఈ బాలిక తాను చేసిన తప్పును ఒప్పుకున్నది. అలాంటి బ్రెడ్ పర్యవసానం పందుల పై అలా ఉంటుందని ఆ బాలిక తలంచలేదు. విషసర్పాల్ని తినే పందుల్ని బరువైన, పుల్లని బ్రెడ్ చంపగలిగితే దాని ప్రభావం కడుపు అనే సున్నితమైన అవయవం పై ఎలా ఉంటుంది?CDTel 329.4