Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    “ఆమె చేకొనవలెను”

    సైన్స్, ఫిబ్ర.26, 1902 335. మనోహ భార్యకు దూత చెప్పిన మాటల్లోని సత్యాన్ని నేటి తల్లులు అధ్యయనం చెయ్యటం వారికి మంచిది. ఈ ఒక్క తల్లితో మాట్లాడటంలో ఆందోళనతో నిండి దుఃఖిస్తున్న ఆ కాలం తల్లులందరితోను, అనంతర తరాల్లోని తల్లులందరితోను, ప్రభువు మాట్లాడాడు. ఔను, ప్రతీ తల్లి తన విధిని అవగాహన చేసుకోవచ్చు. బహిర్గతమైన అనుకూల లేక ప్రతికూల పరిస్థితులపై కన్నా వారు పుట్టక ముందు తన అలవాట్లు అభ్యాసాల పై తన బిడ్డల ప్రవర్తన ఎక్కువ ఆధారపడి ఉంటుందని ఆమె తెలుసుకోవచ్చు.CDTel 224.1

    “ఆమె చే కొనవలెను” అన్నాడు దేవదూత. శోధనను ప్రతిఘటించటానికి ఆమె నిలబడాలి. ఆమె తిండి వాంఛ, రాగద్వేషాలు, నియమం అదుపులో ఉండాలి. ప్రతీ తల్లిని గురించి “ఆమె చేకొనవలెను” అని చెప్పవచ్చు. దేవుడు తనకు బిడ్డనివ్వటంలోని ఉద్దేశాన్ని నెరవేర్చగోరితే ఆమె విసర్జించాల్సింది, వ్యతిరేకించాల్సింది కొంత ఉంది....CDTel 224.2

    తన బిడ్డలకి ఉపాధ్యాయిని కావటానికి యోగ్యురాలైన తల్లి, వారి జననానికి పూర్వం ఆత్మో పేక్ష ఆత్మ సంయమనంతో కూడిన అలవాట్లు నేర్చుకోవాలి. ఎందుచేతనంటే తన సొంత గుణలక్షణాల్ని, తన ప్రవర్తన బలాల్ని, బలహీనతల్ని ఆమె తన బిడ్డలకి అందిస్తుంది. ఈ విషయాన్ని అనేకమంది తల్లిదండ్రులకన్నా ఆత్మల విరోధి అయిన సాతానుకి బాగా తెలుసు. అతడు తల్లి మీదికి శోధనను పంపుతాడు. తాను దాన్ని ప్రతిఘటించకపోతే ఆమె ద్వారా తన బిడ్డను ప్రభావితం చెయ్యవచ్చునని అతడెరుగును. దేవుడే తల్లి ఏకైక నిరీక్షణ. కృపకోసం బలం కోసం ఆమె ఆయన వద్దకు పారిపోవచ్చు. ఆయన్ని ఆశ్రయించటం వ్యర్థ ప్రయత్నం కాబోదు. ఈ జీవితంలో జయం సాధించటానికి, నిత్యజీవాన్ని పొందటానికి తన సంతానానికి తోడ్పడే గుణాల్ని అందించటానికి దేవుడు ఆమెకు శక్తినిస్తాడు.CDTel 224.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents