Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తీవ్ర ధోరణుల విషయంలో ముందు జాగ్రత్త

    ఉత్తరం 98, 1901 CDTel 363.4

    590. ఆరోగ్యసంస్కరణ నియమాల విషయంలో మేలు బదులు హాని చేసే మార్పులు ప్రవేశ పెట్టటానికి కొందరు మొగ్గుచూసే ప్రమాదం ఉంది. ఆరోగ్యసంస్కరణని విప్లవాత్మకంగా సమర్పించకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలు, గుడ్లు, బటర్ ని పూర్తిగా విసర్జించాలని మనం చెప్పలేం. కొత్త విషయాల్ని సమర్పించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తీవ్ర భావాల ప్రకటన ప్రభావం కింద పాపభీతిగల కొందరు ఆహారం విషయమై తీవ్ర వైఖరి అవలంబిస్తారు. వారి శారీరక రూపం ఆరోగ్య సంస్కరణ కృషికి విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే తాము విసర్జించిన వాటి స్థానంలో ఇతర పదార్థాల్ని ఎలా సమకూర్చుకోవాలో తెలిసిన వారు బహు కొద్దిమందే. CDTel 363.5

    (1909) 9T 162 CDTel 364.1

    591. బటర్ వాడకం వల్ల చోటు చేసుకునే అపాయాల గురించి, పిల్లలు యథేచ్చగా గుడ్లు తినటం వల్ల సంభవించే హాని గురించి హెచ్చరికలు వినిపిస్తుండగా, సరియైన మేత పెట్టి జాగ్రత్తగా పెంచిన కోడి పెట్టల గుడ్లు తినటం ఆరోగ్య సంస్కరణ నియమ ఉల్లంఘనగా పరిగణించ కూడదు. గుడ్లలో ఉండే కొన్ని గుణాలు కొన్ని విషాలకి విరుగుడుగా పనిచేస్తాయి.CDTel 364.2

    పాలు, గుడ్లు, బటర్ ఉపయోగించటం మానటంలో కొందరు తమ శరీర వ్యవస్థకు సరియైన పోషక పదార్థాల్ని సరఫరా చెయ్యటంలో విఫలం చెందుతారు. ఫలితంగా వారు బలహీనులై పని చెయ్యటానికి అసమర్ధులవుతారు. ఆరోగ్య సంస్కరణ ఇలా చెడ్డ పేరు పొందుతుంది. దైవ సేవని స్థిరంగా పటిష్ఠంగా నిర్మించటానికి చేసే కృషి దేవుడు కోరని అన్యవిషయాలతో గలిబిలి పర్చటం జరుగుతుంది. సంఘం శక్తి సామర్ధ్యాలు కుంటుబడ్డాయి. కాని ఈ తీవ్ర అభిప్రాయాల పర్యవసానాల్ని నివారించటానికి దేవుడు కలుగజేసుకుంటాడు. సువార్త పాపమానవ జాతిని సమాధాన పర్చాల్సి ఉంది. యేసు పాదాల చెంతకు ధనవంతుల్ని దరిద్రుల్ని అది పోగుచెయ్యాల్సి ఉంది.CDTel 364.3

    ఉత్తరం 37, 1901 CDTel 364.4

    592. పేదవారికి ఆరోగ్య సంస్కరణ వర్తమానం అందించినప్పుడు, “మేము ఏమి తినాలి? మేము పప్పులతో చేసిన ఆహారపదార్ధాల్ని కొనలేం” అని వారంటారు. బీద వారికి సువార్త ప్రకటించేటప్పుడు మిక్కిలి పోషకపదార్ధాలు గల ఆహారం తినాల్సిందిగా వారిని ఉపదేశించమని దేవుడు నన్ను ఆదేశిస్తాడు. “గుడ్లు తినకూడదు లేక పాలు లేక వెన్న వాడకూడదు, ఆహారం తయారుచెయ్యటంలో బటర్ ఉపయోగించకూడదు” అని నేను వారికి చెప్పలేను. బీదలకి సువార్త ప్రకటించాలి. కఠినమైన ఆహార విధిని నియమించటానికి సమయం ఇంకా రాలేదు....CDTel 364.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents