Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సువార్త సేవ - నగరాల్లో సేవా సంస్థలు

    (1909) 9T 112 CDTel 470.2

    778. ఓ జనాంగంగా ఆరోగ్యసంస్కరణ నియమాల్ని ప్రచురపర్చే పనిని దేవుడు మనకిచ్చాడు. ఆహారాన్ని గూర్చిన విషయం తమ సువార్త సేవలో చేర్చాల్సినంత ప్రాముఖ్యమున్నది కాదని భావించే వారు కొందరున్నారు. కానీ వారు గొప్ప తప్పిదం చేస్తున్నారు. దైవ వాక్యం ఇలా అంటున్నది, ” కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” 1 కొరింథి 10:31. మితంగా తినటం తాగటం అన్న అంశానికి రక్షణ పరిచర్యలో ముఖ్యమైన స్థానం ఉంది.CDTel 470.3

    మన నగర సువార్త సేవా సంస్థలకు అనుబంధంగా తగిన గదులు ఏర్పాటు చెయ్యాలి. ఎవరిలో ఆసక్తి మేల్కొంటుందో వారిని ఆ గదుల్లో సమావేశపర్చి ఉపదేశమివ్వాలి. అగత్యమైన ఈ పనిని బలహీనంగా అరకొరగా ప్రజలకు సదభిప్రాయం కలిగించని రీతిగా నిర్వహించకూడదు. మూడోదూత వర్తమానంలోని సత్యాలపరిశుద్ధతను ప్రాముఖ్యాన్ని సరియైన విధంగా సూచిస్తూ జరిగే సమస్తం సత్యానికి కర్త అయిన ప్రభువును గూర్చి మంచి సాక్షమివ్వాలి.CDTel 470.4

    [C.T.B.H.117] (1890)C.H.449,450 CDTel 470.5

    779. మన సేవాసంస్థలన్నింటిలోను జ్ఞానవివేకాలుగల స్త్రీలు గృహ ఏర్పాట్లలో నాయకత్వం వహించాలి. వారు చక్కగా ఆరోగ్యకరంగా ఆహారం తయారుచెయ్యగల స్త్రీలై ఉండాలి. భోజన బల్లలపై నాణ్యత శ్రేష్ఠతగల ఆహారం సమృద్ధిగా ఉంచాలి. టీ, కాఫీ, మసాలాలు కోరే వక్రరుచులు అభిరుచులు కలిగి అనారోగ్యకరమైన వంటకాలు కావాలనే వారెవరైనా ఉంటే వారికి జ్ఞానోదయం కలిగించండి. మనస్సాక్షిని మేల్కొల్పటానికి (ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని గూర్చిన బైబిలు నియమాల్ని వారికి సమర్పించండి.CDTel 470.6